హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు చేతుల మీదుగా శ్రీమాతా ట్రస్ట్ బ్రోచర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిన్నమనేని విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో మన ధర్మాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై చాలా ఉందని, ఈ దశలో ధర్మ పరిరక్షణార్థం ఇలాంటి ట్రస్టులు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులను అభినందించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రవీణ్ పబ్బా, శ్రీ దివ్యానంద మాట్లాడుతూ.. ధర్మోరక్షతి రక్షితః అనే ఉద్దేశ్యమే మమ్మల్ని ఈ సేవా కార్యక్రమానికి ప్రేరేపించిందన్నారు. ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించిన చెన్నమనేని విద్యాసాగర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ముద్దం స్వామి, సౌధాల ప్రభాకర్ పాల్గొన్నారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/