విశాఖ (మీడియాబాస్ నెట్‌వర్క్): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బిడ్ దాఖలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునే బాధ్యత తెలుగు ప్రజలందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. బిడ్లు దాఖలు చేసేందుకు తుది గడువు ఏప్రిల్ 15 మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తుందనగా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తుది గడువును మరో 5 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇప్పటివరకూ 22 బిడ్లు దాఖలైనట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి అధికారుల రాకతో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారగా.. తాజాగా వీవీ లక్ష్మీనారాయణ ఎంట్రీతో ఇది మరో మలుపు తిరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నట్లు ఎవరికి వారే క్లెయిమ్ చేసుకుంటున్న వేళ ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మనమంతా బిడ్డలా కాపాడుకోవాలని, అందుకే బిడ్ వేసేందుకు వచ్చానని వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ‘‘ప్రభుత్వ పాలసీ ‘క్లీన్ షేవ్’ అయితే, మా పాలసీ ‘క్లియర్ సేవ్’’ అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలని తమ ఆకాంక్ష అని ఆయన అన్నారు. అందుకోసం పోరాడున్నవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. లక్ష్మీనారాయణ నిర్ణయాన్ని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆహ్వానించారు.
‘బిడ్ వేశారు.. మరి నిధులు ఎలా?’ అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు లక్ష్మీనారాయణ ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. ఎనిమిది కోట్ల మంది తెలుగువారు 100 రూపాయల చొప్పున వేసుకుంటే రూ. 800 కోట్లు అవుతుందని, అలా 4 నెలల పాటు వేసుకుంటే, రూ.3200 కోట్లు అవుతాయని చెప్పారు. ఆ సొమ్ముతో విశాఖ ఉక్కును కాపాడుకోవడం, నిర్వహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.
‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద బిడ్ వేసేందుకు వచ్చాం. వాళ్లు (వైజాగ్ స్టీల్ ప్లాంట్) క్వాలిఫై చేస్తారా, డిస్‌క్వాలిఫై చేస్తారా.. ఏం నిర్ణయం తీసుకుంటారో చూసిన తర్వాత నిధులు ఎలా సమకూర్చాలి అనే దాని గురించి ఆలోచిస్తాం’ అని లక్ష్మీనారాయణ అన్నారు. ఉక్కు పరిశ్రమ సీజీఎం సత్యానంద్‌కు ఆయన బిడ్డింగ్ పత్రాలను అందజేశారు.
ఆర్‌ఐఎన్‌ఎల్ మార్చి 21న విడుదల చేసిన ప్రకటన ప్రకారం శనివారం మధ్యాహ్నంతో బిడ్లు దాఖలు చేసేందుకు గడువు ముగియగా.. మరో 5 రోజులు పొడిగించింది. ఈ వ్యాపారంతో ముడిపడి ఉన్న కంపెనీలు మార్కెటింగ్ శాఖకు మెయిల్ చేయడం ద్వారా లేదా నేరుగా లేదా వ్యక్తుల ద్వారా బిడ్లు దాఖలు చేయవచ్చని తెలిపింది. వర్కింగ్ క్యాపిటల్, ముడి సరకు కోసం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విధానం ద్వారా బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. బిడ్లు దాఖలు చేసే వారు స్టీల్ వ్యాపారంలో ఉండాలని ప్రాథమిక అర్హతగా నిర్ణయించింది.
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews