తెలుగు తెర‌పైకి మ‌రో స‌స్పెన్స్ క్రైం థ్రిల్ల‌ర్ వ‌చ్చేసింది. బాహుబలి ప్రభాకర్‌, అక్షిత్‌ అంగీరస, రమ్య రాజ్‌, రమ్య నాని, సిరి, ప్రియా ప్రధాన పాత్రల్లో న‌టించిన సినిమా ‘వీకెండ్‌ పార్టీ’. యూత్‌ను టార్గెట్ చేస్తూ బోయ చేతన్‌ బాబు నిర్మాణంలో, డైరెక్ట‌ర్ అమరేందర్ తెరకెక్కించిన ఈ సినిమా తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది? ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉంది? యూత్‌కు క‌నెక్ట్ అవుతుందా? ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

క‌థ‌:
హైదరాబాద్ నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నలుగురు అమ్మాయిలు సరదాగా నాగార్జున సాగర్‌కు వీకెండ్ ట్రిప్‌కు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు రాత్రికి ప్రైవేట్ గెస్ట్ హౌస్ బుక్ చేసుకుంటారు. గెస్ట్ హౌస్‌కి చేరుకునే సమయానికి సూర్యాస్తమయం అవుతుంది. స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకుంటారు. గెస్ట్ హౌస్‌లో పనిచేసే ఓ కుర్రాడు వచ్చాడు. అమ్మాయిల అభ్యర్థన మేరకు అబ్బాయి పానీయాలు సిగార్లు, హుక్కా ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు రాత్రి ఎంజాయ్ చేస్తారు. ఉదయం లేచి చూసే స‌రికి ఆ కుర్రాడు అపస్మారక స్థితిలో ఉంటాడు. పోలీసులు ఎంట్రీ ఇస్తారు. CI ప్రభాకర్ ఆ న‌లుగురు అమ్మాయిల‌ను ప‌ట్టుకుని కేసును ప‌రిష్క‌రిస్తాడా? అస‌లు ఆ వీకెండ్ రాత్రి గెస్ట్ హౌస్ లో బాలుడు ఎందుకు అపస్మారక స్థితిలో ఉన్నాడు? ఆ వీకెండ్ పార్టీలో ఏం జరిగింది? ఏమైంది? చివరికి అమ్మాయిలు.. అలాగే అపస్మారక స్థితిలో ఉన్న బాలుడి పరిస్థితి ఏమిటి? ఈ ప్ర‌శ్న‌ల‌కు అన్స‌ర్ తెలియాలంటే వీకెండ్ పార్టీ సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్ర‌తిభ‌:
ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో సీఐ ప్రభాకర్‌గా బాహుబ‌లి ప్రభాకర్ న‌టించాడు. సినిమాకు ఆయ‌నే ప్ల‌స్ పాయింట్ అని చెప్పొచ్చు. పాత్ర‌కు త‌గ్గ ఫ‌ర్మార్మెన్స్ చేసి శ‌భాష్ అనిపించుకున్నాడు. లేడీ కానిస్టేబుల్‌గా శోభ పాత్ర‌లో గీతాసింగ్ న‌ట‌న కూడా బాగుంది. ప్రాథ‌మిక కేసును డీల్ చేసే ఎస్ఐ విజ‌య్ పాత్ర‌లో గుంటూరు విజ‌య్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమాకు కీల‌క‌మైన అంజి పాత్రలో అక్షిత్ అంగీరస న‌ట‌న అంద‌రిని మెప్పిస్తుంది. ఇక న‌లుగురు అమ్మాయిల్లో జ్యోతిగా గీతిక, వెన్నెలగా సిరి స్టాజీ, సువర్ణగా రమ్య, ప్రతిభగా రమ్య రాజ్ నటించారు. వీళ్లు బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ పాత్ర‌ల్లో చాలా యాక్టివ్‌గా న‌టించారు. ఇక ఇత‌ర పాత్ర‌ల్లో శ్రీ‌మ‌ణి, జ‌య‌నాయుడు, ర‌మ‌ణి సిద్ధి, ల‌లితారాజ్‌.. త‌దిత‌రులు త‌మ త‌మ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు:
ఈ సినిమాకు ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్. స‌దా చంద్ర అందించిన‌ మ్యూజిక్ ఎవ‌రికైనా న‌చ్చుతుంది. ఆస్కార్ అవార్డు విన్న‌ర్ చంద్ర‌బోస్ ‘‘ప‌ల్లెటూరిలోన సాధ్యం…’’ అనే సూప‌ర్ పాట‌ను రాశాడు. అలాగే ట్రెండింగ్‌లో ఉన్న‌ మ‌రో లిరిక్ రైట‌ర్ కాస‌ర్ల శ్యామ్ ‘‘పాల బుగ్గల పిల్లోడే…’’ అనే జోష్ ఉండే పాట రాశాడు. ఇలాంటి క్రైం థ్రిల్ల‌ర్‌ల‌కు సూట‌య్యే సినిమాటోగ్ర‌ఫి అందించాడు రామ్ అద్దంకి. ఇత‌డే డీఐ కూడా చేశాడు. వెంక‌ట్ వేముల ఎడిటింగ్ కూడా బాగుంది. టెక్నిక‌ల్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఈ సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్ సుచిత్రాచంద్రబోస్ అందించిన కొరియోగ్ర‌ఫీ. ఇక‌ క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా ఖ‌ర్చు పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

విశ్లేష‌ణ‌:
1990ల ప్రారంభంలో నాగార్జున సాగర్ వద్ద జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప్రముఖ తెలుగు రచయిత డా.బోయ జంగయ్య “అడ్డదారులు’’ పేరిట రాసిన క‌థ ఆధారంగా ఈ సినిమా తీశారు. బోయ జంగయ్య త‌న‌యుడు చేత‌న్ బాబు బోయ‌ ఈ సినిమాను నిర్మించాడు. ఊహించని ట్విస్ట్, స్టార్టింగ్ నుండి చివరివరకు చాలా ఇంటరెస్ట్ గా కథ సాగుతుంది, పాట‌లు చాలా బాగున్నాయి. యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ఈ త‌రం యూత్ త‌మ ప్లానింగ్‌లో జ‌రిగే క్ర‌మాల‌ను, వారి ఆలోచ‌న విధానాన్ని చాలా బాగా చూపించాడు డైరెక్టర్. అంద‌రికి క‌నెక్ట్ అవుతుంది. అందరూ చూడాల్సిన సినిమా అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

రేటింగ్ 3.25 / 5

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin