యువతని ఆకర్షించే కథాంశంతో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘6 జర్నీ’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని బసీర్ అలూరి తెరకెక్కించగా, పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించారు. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు.
థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా, జూలై 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
యువత ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే కథ!
‘6 జర్నీ’ కథ స్నేహం, ప్రేమ, మిస్టరీ, యాక్షన్, దేశభక్తి వంటి అనేక భావోద్వేగాలతో నిండిన ఆసక్తికర ప్రయాణంగా రూపొందింది. ఓటమిని తట్టుకోలేక జీవితాన్ని ముగించాలనుకునే యువతకు ఈ సినిమా స్ఫూర్తినిస్తుంది.
కథలోకి వెళ్తే…
వికేషన్ కోసం అడవిలోకి బయలుదేరిన కొంతమంది యువతీ యువకులు అనుకోని పరిస్థితుల్లో ఉగ్రవాదుల చెరలో చిక్కుకుంటారు. ఆ అడవిలో ఉగ్రవాదులు ఏమి చేస్తున్నారు? వాళ్లను ఆదుకునే వ్యక్తులు ఎవరు? చివరకు ఆ యువత ఎలాంటి సాహసాలతో బయటపడతారు? అనే మలుపులు కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి.
దర్శకుడు బసీర్ అలూరి కథను ఆసక్తికరంగా నడిపించగా, నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.
థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయనుంది.
ఊహించలేని మలుపులతో సాగే సాహస గాథ.. జూలై 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ అద్వితీయ జర్నీ షురూ!