🔸 మా పోరాటం కొనసాగుతుంది
🔸 ఎంపీ రఘురామకృష్ణంరాజు తీరుపై ఫైర్
🔸 ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో రామకృష్ణ పోరాటం
🔸 ఆటంకాలను సృష్టించే వారికి బుద్ది చెబుతాం: ఎమ్మెన్నార్ గుప్త
విజయవాడ, హైదరాబాద్, చెన్నై బ్యూరో నెట్‌వర్క్:
చింతామణి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. నిషేధం పరిష్కారం కాదంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యాయస్థానంలో పిల్ వేశారు. దీనిపై ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (Wam Global) గ్లోబల్ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ మండిపడ్డారు. చింతామణి నాటకం ఆర్యవైశ్యులను కించపరచడమే కాకుండా అగ్రవర్ణాలతోపాటు అనేక కులాలను, దేశ నాయకులను, చివరికి దేవుళ్లను కూడా పలు సంభాషణలతో ఆవహేళన చేసే విధంగా ఉందని తెలిపారు. అన్ని వయసుల వారిని కూడా కించపరిచే విధంగా ఇందులో కథనం ఉందన్నారు. నేటి సమాజాన్ని చెడదోవ పట్టించే నటన, నృత్యాలు జుగుప్స కలిగించే విధంగా ఉన్నాయన్నారు.
నిజానికి చింతామణి నాటకంలో అసలు కథ వేరు, ఇప్పుడు ప్రదర్శించే నాటకం వేరన్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానంలో వేసిన పిల్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. న్యాయపరంగానూ ఎదుర్కొవడానికి తాము కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. తాము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని కోర్టుల్లోనూ పిటిషన్ వేస్తున్నామని తెలిపారు. చింతమణి నాటకాన్ని నిషేధం కొనసాగించాలని వామ్ గ్లోబల్ (wam Global) ఎన్నారై విభాగ్ చైర్మెన్ ఎమ్మెన్నార్ గుప్త డిమాండ్ చేశారు. ఇరవై ఏళ్ల నుంచి ఈ పోరాటం కొనసాగిస్తున్న టంగుటూరి రామకృష్ణతో కలిసి తాము ముందుకెళ్తామన్నారు. రాజకీయంగా, సామాజికంగా ఆటంకాలు సృష్టించే ఎంపీ రఘురామకృష్ణంరాజు లాంటి వారిని తాము ఎదుర్కొంటామన్నారు.
Indian Entertainment అంతా ఇప్పుడు ఒకే యాప్‌లో
HyStar APPలో మీరూ మీ Profile క్రియేట్ చేసుకొండి
సినిమా ఛాన్స్ – మీడియా అవకాశాలు అందుకొండి..Google play store link:
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystarwebsite link:
www.hystar.in