స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ‘స్టాప్ వాచ్’ మూవీ ఫిబ్ర‌వ‌రి 4న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల అయింది. మారుతి లక్ష్మణ్ నిర్మాణంలో భరత్ వర్మ కాకర్లపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ రిపోర్ట్‌లో తెలుసుకుందాం.

క‌థ:
జై చంద్ర ఒక ప్రముఖ వ్యాపారవేత్త, అతని భార్య (హారిక) రహస్యంగా తప్పిపోతుంది. ఆ కుటుంబం యోగి అనే న్యాయవాదిని నియ‌మించుకుంటుంది. జైని అనుమానించేలా ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆధారాలు ల‌భిస్తాయి. నిజాన్ని విప్పేందుకు జైని విచారిస్తారు. ఈ క్ర‌మంలో యోగి లోతుగా విచారించే స‌మ‌యంలో అనేక ట్విస్టులు బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఇంత‌కీ హారిక రహస్యంగా తప్పిపోవ‌డం వెనుక కార‌ణం ఎవ‌రు? అస‌లేం జ‌రిగింది? అనేది మిగ‌తా క‌థ‌.

ఈ థ్రిల్ల‌ర్ స్టోరీని తెర‌కెక్కించ‌డంలో డైరెక్ట‌ర్ భరత్ వర్మ కాకర్లపూడికి మంచి ప‌ట్టు సాధించాడ‌నే చెప్పొచ్చు. స‌స్పెన్స్‌ను లాగ‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. ఈ స‌బ్జెక్టును నీట్‌గా రూపొందించ‌డంలో ఆయ‌న శైలి ఆక‌ట్టుకుంది.

ప‌ర్మామెన్స్:
న‌టీన‌టుల ప‌ర్మామెన్స్ విషయానికి వ‌స్తే… యోగి పాత్రలో స్వర్ణకాంత్ న‌టించాడు. సినిమాకు ప్ర‌ధాన‌మైన అడ్వ‌కేట్ పాత్ర‌లో ప‌ర్‌ఫెక్టుగా సూట‌య్యాడు. ఇక జై విశ్వనాథ్‌గా జై చంద్ర న‌టించాడు. బిజినెస్‌మెన్‌గా త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. ఇక అతని భార్య‌ హారికగా రేఖ నిరోషా న‌టించింది. ఈమె న‌ట‌న కూడా బాగుంది. ఈ సినిమాకు ఇవే మూడు ప్ర‌ధాన పాత్ర‌ల‌ని చెప్పుకొవ‌చ్చు. న‌టీన‌టులు అంతా కొత్త వాళ్లే క‌నిపిస్తారు.

టెక్నిక‌ల్:
ఇక టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే… ఫోటోగ్ర‌ఫి విష‌యంలో యేసు త‌న టాలెంట్ చూపించాడు. ఇలాంటి థ్రిల్ల‌ర్ స్టోరీల‌ను ఎలా చూపించాలో ఆయ‌న‌కు ప‌ట్టు ఉంద‌నే విష‌యం రుజువు చేశాడు. ఇక ప్రేమ్ కుమార్ చేసిన‌ ఎడిటింగ్ ప‌ర‌వాలేదనిపిస్తుంది. అజయ్ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా చెప్పుకొవ‌చ్చు. హాలీవుడ్ రేంజ్ లుక్ అద్దిన‌ ఈ సినిమాకు మ‌రింతా బ‌డ్జెట్ పెట్టి ఉంటే ఇంకా బాగుండేద‌ని అనిపిస్తుంది.

ఎక్క‌డా పెద్ద‌గా బోర్ కొట్ట‌కుండా ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అనేక ట్విస్టుల‌తో ముందుకు సాగుతుంది. చాలాకాలం త‌ర్వాత థ్రిల్ల‌ర్ కాన్సెప్టుతో వ‌చ్చిన‌ ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి రెస్పాన్స్ అందుకుంటుంద‌ని చెప్పొచ్చు. ఫైన‌ల్‌గా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కోరుకునే ప్రేక్ష‌కులు ఈ సినిమాను క‌చ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

రేటింగ్‌:  3/5

stop watch movie review

Indian Entertainment అంతా ఇప్పుడు ఒకే యాప్‌లో
HyStar APPలో మీరూ మీ Profile క్రియేట్ చేసుకొండి
సినిమా ఛాన్స్ – మీడియా అవ‌కాశాలు అందుకొండి..

Google play store link:
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

website link:
www.hystar.in

By admin