దేశ‌విదేశాల్లో విడుద‌ల చేసి అభినందించిన ప్ర‌ముఖులు

హైద‌రాబాద్, న్యూయార్క్, వాషింగ్ట‌న్ డీసీ (నెట్‌వ‌ర్క్):
సుదీర్ఘకాలం తన సుమధుర సంగీత గానంతో భారతావనిని ఓలలాడించిన గాన‌కోకిల మూగ‌బోయిన వార్త‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు జీర్జించుకోలేక‌పోతున్నారు. తరాలుగా నిరంతరం వీనుల విందైన పాటలు అందించిన స్వర శిఖరం లతా మంగేష్కర్ కీర్తి అజరామరం. నింగికేగిన స్వర శిఖరం లతా మంగేష్కర్‌పై రైట‌ర్, సింగ‌ర్ టేకుల గోపి ఓ ప్ర‌త్యేక పాట రూపొందించారు. సింగ‌ర్ శివ‌పురం వినీల ఆల‌పించిన ఈ పాట‌ను దేశ‌విదేశాల్లో ప‌లువురు ప్ర‌ముఖులు విడుద‌ల చేసి టేకుల గోపిని అభినందించారు. అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో ప్ర‌ముఖ రైట‌ర్, మూవీ మేక‌ర్ వేణు న‌క్ష‌త్రం ఆవిష్క‌రించి అభినందించారు. అలాగే న్యూయార్క్ సిటీలో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు స్వాతి దేవినేని ఈ పాట‌ను విడుద‌ల చేసి అభినందించారు. హైద‌రాబాద్‌లోనూ జ‌ర్న‌లిస్టు స్వామి ముద్దం ఈ పాట‌ను రూపొందించిన టేకుల గోపిని, పాడిన శివ‌పురం వినీలను అభినందించారు. ఈ పాట ఇప్పుడు డిజిట‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Indian Entertainment అంతా ఇప్పుడు ఒకే యాప్‌లో
HyStar APPలో మీరూ మీ Profile క్రియేట్ చేసుకొండి
సినిమా ఛాన్స్ – మీడియా అవ‌కాశాలు అందుకొండి..

Google play store link:
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

website link:
www.hystar.in

#latamangeshkar

By admin