పోరుబాటకు సిద్ధమైన ఎస్సీ ఉప కులాలు
సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో సమావేశం
57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
2వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలి
కుల ధ్రువీకరణపత్రాలు తహసీల్దార్ ఇవ్వాలి
మే 15 న హైదరాబాద్లో చలో ఇందిరాపార్కు
ఎస్సీ ఉపకులాలకు దళితబందుపథకంలో 40 శాతం కేటాయించాలి
ఎస్సి ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి
గజ్వేల్: తమ సమస్యల సాధన కోసం తెలంగాణలోని ఎస్సీ ఉప కులాలు పోరుబాటకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఎస్పీ నుంచి 57 ఉపకులాలను MBSC (Most backward scheduled Castes) అత్యంత వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మోచి,హోలియదాసరి, మాస్టిన్, మితల్ అయ్యవర్లు, మాంగ్, సమగర, మాలజంగం తదితర కులాలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఆర్డీవో పరిధి నుంచి తొలగించి తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని కోరారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాదసికురువ కులస్థులను ఇబ్బందులు పెట్టకుండా వెంటనే కులధృవీకరణ పత్రాలు జారీచేయలని కోరారు. ఎస్సి ఉపకులాలకు దళితబందుపథకం లో 40 శాతం కేటాయించాలని, జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఉపకులాలకు రాజకీయ పదవులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మే 15 న హైదరాబాద్ లో చలో ఇందిరాపార్కు నిర్వహించబోతున్నారు. ఒకరోజు నిరసనదీక్షను ఉపకులాల ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం మోచి పిలుపునిచ్చారు.
Download BREAKINGNEWS APP From Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
Download BREAKINGNEWS APP From Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews