హీరోగా తండ్రికొడుకుల్లో ఎవ‌రు బెట‌ర్ అనే ప్ర‌శ్న ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి కంటే రామ్ చ‌ర‌ణే బెట‌ర్ అని డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కామెంట్ చేశాడు. చిరంజీవి త‌న ప‌క్క‌న ఎవ‌రున్నా కూడా, త‌న కొడుకు ఉన్నా కూడా త‌నే డామినేట్ చేయాల‌ని కోరుకుంటార‌ని, ఆ ల‌క్ష‌ణం చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంద‌న్నారు. అయితే ఒక ఫ్యాన్‌గా చిరంజీవిగారే బాగా చేస్తార‌ని అనిపిస్తారు కానీ, ఒక డైరెక్ట‌ర్‌గా త‌నకు హీరో రామ్‌చ‌ర‌ణే బెట‌ర్ అనిపిస్తారు అని చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఎలా చేయాలో ఎలా చేయ‌కూడ‌దో యాక్టింగ్ స్కిల్స్ చిరు ద‌గ్గ‌ర చ‌ర‌ణ్ స‌ల‌హాలు తీసుకోవ‌డం లేద‌ని, ఆ విష‌యం ఈ మ‌ధ్య త‌న‌కు తెలిసింద‌న్నారు రాజ‌మౌళి. డైరెక్ట‌ర్ల ద‌గ్గ‌రే చ‌ర‌ణ్ ఫ‌ర్మార్మెన్స్ బాగా ఇంఫ్రూవ్ చేసుకున్నాడ‌ని రాజ‌మౌళి తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతోన్న ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న రాబోతోంది. ఈ మేరకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద్రాబాద్‌లో నిర్వహించింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్‌లో చిరంజీవి-రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రిలో డాన్స్‌లో ఎవ‌రు బెస్ట్ అంటూ యాంక‌ర్ సుమ.. డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ను అడిగింది. దానికి చిరంజీవి అన్స‌ర్ ఇచ్చారు. శివుడి తాండ‌వం ముందు ఎవ‌రూ గొప్ప కాద‌ని, త‌న ముందు ఎవ‌రైనా త‌క్కువే అని చెప్పారు. డైరెక్ట‌ర్ శివ కూడా త‌ను కూడా శివుడినేని ఆ మాట‌కు అగ్రీ చెప్పారు.

ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

By admin