Hyderabad: హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న స్నోవరల్డ్‌ను అధికారులు సీజన్ చేశారు. లీజు బకాయిలు చెల్లించలేదన్న కారణంతో పర్యాటక శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. లీజు బకాయిల విషయంపై ఎన్నిసార్లు నీటీసులిచ్చినా స్పందించకపోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. స్నోవర్డ్ యాజమాన్యం రూ. 16 కోట్లుకు పైగా బకాయిలు ఉన్నట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు.
కోర్ట్ ఆదేశాల ప్రకారం లీజ్ మొత్తాన్ని చెల్లించని కారణంగా TSDTCL ఆదేశాల మేరకు గురువారం ఎస్టేట్ ఆఫీసర్, ఓఎస్‌డితో పాటు ఇతర సిబ్బంది కలిసి స్నో వరల్డ్, దాని ప్రాంగణంలో ఉన్న దుకాణాలను సీజ్ చేశారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందింకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. బకాయిలు చెల్లించాలని కార్పొరేషన్ అధికారులు ఒత్తిడి చేయడంతో మూడేళ్ల కిందట సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఫిటిషన్ ను విచారించిన కోర్టు.. రెండు నెలల్లో బకాయిలు చెల్లించాలని సంస్థను ఆదేశించింది. గడువు ముగిసినా బకాయిలు చెల్లించకపోవడంతో హైకోర్టు ఆదేశాల మేరకు స్నోవరల్డ్ ను సీజ్ చేస్తున్నట్లు టూరిజం కార్పొరేషన్ ఎండీ బి.మనోహర్వెల్లడించారు.
అనంతరం స్నోవరల్డ్ వద్ద TSDTCL సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసింది. మంచు థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ పర్యాటక ప్రదేశాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సందర్శిస్తుంటారు. మరి యాజమాన్యం ఎలాంటి దిద్దుబాటు చర్యలకు దిగుతుందో చూడాలి.