మెల్బోర్న్(నెట్‌వర్క్): ATAI ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్స లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ATAI సభ్యులు, వివిధ సిటీ కౌన్సిల్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెల్బోర్న్ వాసులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రత్యక్షంగా ఈ పండగ జరపుకోలేనందున ఈ ఏడాది రెట్టింపు ఆనందోత్సహాల మధ్య జరుపుకున్నారు.
బతుకమ్మ పండగలో భాగంగా ఆటపాటలు కనువిందుగా జరిగాయి. ఆటపాటలతోపాటు కమ్మని తెలంగాణ వంటకాలు ఆనందానికి రుచిని జోడించాయి. బతుకమ్మకు ATAI కార్యవర్గ సభ్యులు సకినాలు, సర్వపిండి, పచ్చి పులుసు, డబల్కా మీఠా, మలిల ముద్దలు.. వంటి తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ATAI ప్రధాన ఆశయాలలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించటం ప్రధానమైనదని ATAI అధ్యక్షులు అనిల్ బైరెడ్డి చెప్పారు. ATAI ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజు బతుకమ్మ ఆడటం, పిల్లకు పెయింటింగ్, డ్రాయింగ్, డబేట్ వంటి కార్యక్రమాలు జరుపుకోవటం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూాడా ATAI బతుకమ్మలను తెచ్చిన ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరిగింది. ప్రథమ మూడు బతుకమ్మలను బంగారు నాణాలను, ప్రతి ఒక్క బతుకమ్మకు వెండి నాణాలను బహుకరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ATAI అధ్యక్షులు అనిల్ బైరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.




