హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
తెలంగాణ‌లోని ఐటీ ప‌రిశ్ర‌మకు వేదిక తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (TITA) 2023-26 సంవ‌త్స‌రాల‌కుగాను నూత‌న ఏర్పాటు అయింది. కౌన్సిల్ ఉపాధ్య‌క్షుడు రాణా ప్ర‌తాప్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు అశ్విన్ చంద్ర వ‌ల‌బోజు, న‌వీన్ చింత‌ల‌, కోశాధికారి ర‌వి లెల్ల‌, రాష్ట్ర కార్య‌ద‌ర్శులుగా ఎంపికౌన విన‌య్ తూము, దీపికా జోషి ఓవ‌ర్సీస్ కో-ఆర్డినేట‌ర్ ఎమ్మెన్నార్ గుప్త, మ‌లేషియా, యూకే చాప్ట‌ర్ల అధ్య‌క్షులు పోత‌రాజు, హితేష్ బిక్కుమ‌ల్ల‌, జిల్లాల కార్య‌ద‌ర్శులు.. జ‌నగాం-శ్రావ‌ణి బాస‌రాజు, ఖ‌మ్మం-క్రాంతి, సిరిసిల్లా-సంతోష్ రెడ్డి, మెద‌క్-సాయిరాదాస్ ప‌ల్లి, విద్యార్థి విభాగం కార్య‌ద‌ర్శులుగా ఎన్నికౌన చినోల మాధ‌వ్, అభిలాష్ రంగినేని, సింధూజ వంగ‌, నిత్య‌రాజ్ కొంప‌ల్లి, సంయుక్త కార్య‌ద‌ర్శులు కౌకుంట్ల మేఘ‌న‌, గొలివ‌ర్ణిత‌, రాళ్ల‌ప‌ల్లి రోహిత్, మ‌నీష్ నియామ‌క ప‌త్రాలు అందుకున్నారు.

టీ-హ‌బ్-2.0లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో టీటా నూత‌న కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు తెలంగాణ హోంశాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీ, టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ ప‌ఖ్త‌ల‌తో క‌లిసి నియ‌మ‌క‌ప‌త్రాలు అందించారు.

బీసీ కమిషన్ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ను స‌త్క‌రిస్తున్న TITA గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మ‌ఖ్త‌ల‌, TITA ఓవ‌ర్సీస్ కో-ఆర్డినేట‌ర్ ఎమ్మెన్నార్ గుప్త.

తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో రాష్ట్ర సాధ‌న‌లో త‌మ పాత్ర పోషించాల‌నే ఉద్దేశంతో ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న సందీప్ కుమార్ మ‌ఖ్త‌ల 2010లో తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (TITA)ను ప్రారంభించారు. ఉద్యోగాలు తొల‌గిస్తామ‌నే బెదిరింపులు వ‌చ్చిన‌ప్ప‌టికీ లెక్క చేయ‌కుండా సందీప్ మ‌ఖ్త‌లతో పాటుగా ఆయ‌న వెంట న‌డిచిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చురుకుగా తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్నారు. 2013లో అధికారిక రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి చేసుకున్న టీటా, సెప్టెంబర్ 2014 నుంచి ప్ర‌తి నాలుగేళ్ల కాలానికి గ్లోబ‌ల్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటుంది. ఈ నేప‌థ్యంలో 2018లో ఎన్నిక జ‌ర‌గ‌గా సందీప్ కుమార్ మ‌ఖ్త‌ల అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. సందీప్ మ‌ఖ్త‌ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంతో పాటుగా అనేక ప్ర‌భుత్వ, ప్రైవేటు సంస్థ‌ల‌తో టీటా ఒప్పందం కుదుర్చుకొని ఐటీ ఉద్యోగులు, ప‌రిశ్ర‌మ‌ కోసం ఎన్నో సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్ర‌మాల‌ను నిర్వ‌హించింది. దీంతో పాటుగా ప్ర‌జ‌ల‌కు మేలు చేసే ప‌లు టెక్నాల‌జీ ఆధారిత చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ కృషి ఫ‌లితంగా వ‌రుస‌గా మూడు సంవ‌త్స‌రాల పాటు ఉత్త‌మ సంస్థ అవార్డును తెలంగాణ‌ ప్ర‌భుత్వం అంద‌జేసింది. దీంతోపాటుగా ఎన్నో జాతీయ, అంత‌ర్జాతీయ అవార్డులు సైతం టీటా సొంతం చేసుకుంది.

TITA గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మ‌ఖ్త‌ల‌తో క‌లిసి TITA ఓవ‌ర్సీస్ కో-ఆర్డినేట‌ర్ ఎమ్మెన్నార్ గుప్త.

 

By admin