మస్కట్: గల్ఫ్ దేశాల్లో ఒకటైన ఒమన్‌లో మన తెలుగు ఎన్నారైలు లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరు కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రవాస కార్మికలు అత్యధికంగా వలసలు వెళ్ళే ఒమన్ లో ఉంటున్న తెలంగాణా వాసులు అందరూ కలిసి తెలంగాణా సమితిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమితి ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామీ వారి తిరు కళ్యాణాన్ని నిర్వహించాలని తలపెట్టి తెలంగాణ రాష్ట్రంలో యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామీ వారి ఆలయ కమిటిని సంప్రదించి ఒమన్ లో తిరు కళ్యాణం ఏర్పాటు చేశారు.
యాదరిగి గుట్ట స్వామి వారి ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహా చార్యులు, తన బృందంతో కలిసి ఒమన్ లో కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి ఒమన్ చుట్టుపక్కల నుంచీ తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు తరలి వచ్చారు. కళ్యాణం జరుగుతున్న ఆధ్యాంతం భక్తులు నమో నారసింహాయ నామ స్మరణతో కార్యక్రమ ప్రాంగణం మారుమోగిపోయింది. ఎడారి దేశంలో ఇలా స్వామి వారిని దర్శించుకుని కళ్యాణం తిలకించేలా అవకాశం కల్పించిన తెలంగాణా సమితికి తెలుగు వారందరూ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చిన భక్తులకు నిర్వాహకులు భోజనాలు ఏర్పాటు చేయగా, అయ్యప్ప స్వాములు వంటలను స్వయంగా వడ్డించారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews