అగ్ర‌రాజ్యం అమెరికాలో అద్భుతమైన దేవాలయాల ఉన్నాయి. వాటిల్లో చెప్పుకోద‌గింది హనుమాన్ టెంపుల్. ఈ అతిపెద్ద హనుమాన్ విగ్రహం గురించి తెలుసుకుందాం.

ప్రపంచలోనే శక్తి వంతమైన దేశం అమెరికా.. ఇక్కడ చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని, చాలామంది కలలు కంటూ ఉంటారు. ఏటా మనదేశం నుంచే 2 లక్షల మంది అమెరికా వెళుతున్నారు. అమెరికా జనాభా 29 కోట్లు. 2019 నుంచి అమెరికాలో నివసించే హిందూ జనాభా 32 లక్షలకు చేరింది. వీరిలో అత్యధికులు భారతీయులే. ప్రస్తుతం అమెరికాలో హిందూ జనాభా 40 లక్షలు. అమెరికా పౌరులు కూడా హిందూ ధర్మాన్ని నమ్ముతున్నారు. అందుకే 2020లో అమెరికాలోని డెలాయిట్ రాష్ట్రంలో 25 అడుగుల హనుమంతుని విగ్రహం ప్రతిష్టించారు. ఈ విగ్రహం బరువు 30000 కిలోలు. ఈ విగ్రహాన్ని భారత్ లోనే తయారు చేశారు. తెలంగాణలోని వరంగల్ లో గ్రానైట్ తో తయారు చేశారు, ఈ విగ్రహం ఖరీదు లక్ష డాలర్లు. అంటే అక్షరాలా 80 లక్షలన్నమాట.

గుండె నిండా దాచుకున్న భక్తిని సప్త సముద్రాలు దాటించారు. 25 అడుగుల ఎత్తు 30 టన్నుల బరువు ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని అమెరికాలో ప్రతిష్టించి హిందూ సంప్రదాయాన్ని అగ్రరాజ్యానికి పరిచయం చేశారు. అమెరికాలోని డెలాయిట్ రాష్ట్రంలో ఆంజనేయస్వామి విగ్రహం కొలువుదీరింది. సుమారు 25 అడుగుల ఎత్తూ ముప్పై టన్నుల బరువు ఉండే ఈ విగ్రహాన్ని వరంగల్ నుంచి సప్త సముద్రాలు దాటించి అమెరికా తీసుకొచ్చారు. కరీంనగర్‌కు చెందిన రాజు తన 12 మంది టీంతో కలిసి ఈ విగ్రాహాన్ని చెక్కారు. 12 మంది సభ్యులు సుమారు ఆరు నెలలు కష్టపడి ఈ విగ్రహాన్ని చెక్కినట్లు రాజు తెలిపారు. గత జనవరిలో ఈ విగ్రహాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరానికి షిప్ ద్వారా తరలించారు. అక్కడి నుంచి ట్రక్ ద్వారా డెలాయిట్ రాష్ట్రంలోని హాకేస్సన్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ హిందూ భక్తులు అంతా కలిసి ఎంతో అంగరంగ వైభవంగా విగ్రహాన్ని ప్రతిష్టించారు. పదిరోజులు పాటు ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. పది రోజులపాటు పూజలు యాగాల తరువాత ఈ విగ్రహాన్ని డెలాయిట్ రాష్ట్రంలో స్థాపించారు. అమెరికాలో ఉన్న ఎత్తైన విగ్రహాల్లో ఈ విగ్రహం ఒకటిగా విరాజిల్లుతోంది.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV & APP

 

By admin