హైదరాబాద్, (మీడియాబాస్ నెట్‌వర్క్):
పచ్చదనం మన ప్రగతికి సంకేతం అంటూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు ‘మనం’ ఫౌండేషన్ నిర్వహకులు శ్రీలత – కుమార్. కార్తీక మాస పర్వదినాన తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉసిరి చెట్టు నాటారు.
ఈ సందర్భంగా ‘మనం’ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీలత – కుమార్ మాట్లాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పచ్చదనం మన ప్రగతికి సంకేతం.. మనమందరం మెకానికల్ లైఫ్ లో బతుకుతున్నాము. కానీ మొక్కలు వాటి వల్ల జరిగే లాభాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్నారు. మొక్కలు ప్రాణ వాయువు మాత్రమే కాకుండా మానవ మనుగడకు కావలసిన చాలా వాటిని మనకు వృక్షాలు సమకూరుస్తాయి కాబట్టి మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా మన అందరి మీద ఉంది అన్నారు. సమయం ఉన్నపుడు ప్రతీ ఒక్కరు ఒక్కొక్క మొక్క నాటాల్సిన బాధ్యత ఎంతయినా ఉంది అన్నారు. మనం తీసుకునే గాలి స్వచ్చంగా ఉండాలన్నా పొల్యూషన్ తగ్గించాలన్నా మొక్కలు అందరూ నాటాలని కోరారు. ఇలాంటి బృహత్కర కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్ కి, GIC Team కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews