seetha ram puram lo oka prema janta

చిత్రం : సీతారామపురం
హీరోహీరోయిన్ : రణధీర్ ,నందిని
నటీనటులు : సుమన్‌, సూర్య, అమిత్‌ తివారీ, నిట్టల్‌, మిర్చి మాధవి,
సంధ్య సన్‌ షైన్‌, సుష్మా గోపాల్‌, భాషా, చంద్రకాంత్‌, బీహెచ్‌ఈఎల్‌ ప్రసాద్‌,
లేట్‌ శివ శంకర్‌ మాస్టర్‌, సురేష్‌..
సాంకేతిక నిపుణులుః
బేన‌ర్ః శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌
డిఓపి: విజయ్‌ కుమార్‌ ఎ.
ఎడిటింగ్‌: నందమూరి హరి, ఎన్టీఆర్‌,
సంగీతం: ఎస్‌.ఎస్‌.నివాస్‌,
ఫైట్స్‌: రామ్‌ సుంకర,
కొరియోగ్రఫీ: అజయ్‌ శివ శంకర్‌, గణేష్‌, మహేష్‌,
పిఆర్ఓ: చందు రమేష్,
కథ- కథనం-మాటలు-దర్శకత్వం: ఎం. వినయ్‌ బాబు

ఒక అంద‌మైన గ్రామం. అక్క‌డ ఓ స్వ‌చ్చ‌మైన‌ ప్రేమ క‌థ‌నం. విన‌డానికి చూడ‌టానికి ఎంతో బాగుంటుంది. అచ్చం అలాంటి నేప‌థ్యంతో తెర‌కెక్కిన సినిమా “ సీతారామ‌పురంలో ఒక ప్రేమ‌జంట‌`. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వ‌చ్చే ప్రేమ‌క‌థా చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు.. ఆదే బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన ఈ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థా చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇప్పటి వరకు రిలీజైన పాట‌లు, ట్రైల‌ర్స్ తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ :

ఈ సినిమాలో సీతారామపురం అనే ఒక గ్రామం నేప‌థ్యంగా ఈ సినిమా సాగుతుంది. ఇందులో సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్.. స‌ర్పంచ్ ప‌టేల్ పాత్ర‌లో న‌టించాడు. ఆ స‌ర్పంచ్‌కి నందు ( హీరోయిన్ నందిని) అనే ఒక అంద‌మైన కూతురు ఉంటుంది. అదే ఊరిలో న‌ర్సింహ గౌడ్ (సూర్య‌)మాజీ స‌ర్పంచ్ కొడుకు శివ (ర‌ణ‌ధీర్‌) నందు ఇద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి చ‌దువుకుంటారు. దీంతో వారి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ హీరోయిన్ నందుకి మేన‌బావ ( అమిత్‌) ఉంటాడు. అత‌నికి ఇచ్చి పెళ్లి చేయాల‌న్న‌ది ప‌టేల్ ఆలోచ‌న‌. ఈ క్ర‌మంలో నందు, శివ ల ప్రేమ విష‌యం పెద్ద‌ల‌కు తెలుస్తుంది. ఇద్ద‌రి ఇంట్లో వార్నింగ్ ఇస్తారు. దీంతో ఒకానొక రోజు హీరో హీరోయిన్ లేచిపోతారు. దీంతో ఇద్ద‌రి ఇంట్లో పెద్ద‌లు రాజీ కొచ్చి .. వెత‌కడం ప్రారంభిస్తారు. కానీ అప్ప‌టికే నందుతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అమిత్ కి అది న‌చ్చ‌దు . అమిత్ ఎలాగైనా త‌న మేన మ‌ర‌ద‌ల్ని పెళ్లి చేసుకుని ప‌టేల్ ఆస్తి కొట్టేయాల‌ని రౌడీల‌ను తీసుకొని హీరో హీరోయిన్ల‌ను వెతికి ప‌ట్టుకుంటాడు. ఆ త‌ర్వాత ఏమైంది? హీరో హీరోయిన్ల‌ను అమిత్ ఏం చేసాడు? ఎంతో గాఢంగా ప్రేమించిన హీరో శివ కోసం హీరోయిన్ నందు ఏం చేసింది? అనేది క్లైమాక్స్. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు:

ర‌ణ‌ధీర్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. త‌న‌కు ఫ‌స్ట్ మూవీ అయినా ఎంతో అనుభ‌వం ఉన్న హీరోలా న‌టించాడు. ఒక ప‌ల్లెటూరి కుర్రాడిగా, ల‌వ‌ర్ బాయ్ గా మెప్పించాడు. ఇంకొంచెం ట్రై చేస్తే మాస్ హీరోగా ఎదిగే అవ‌కాశాలు ఉన్నాయి. డైలాగ్స్‌, డాన్స్, ఫైట్స్ బాగా చేశాడు. ఇక ప‌ల్లెటూరి గ‌డుసుపిల్ల‌గా హీరోయిన్ నందిని సూప‌ర్‌గా చేసింది. తెలంగాణ యాస‌లో త‌ను చెప్పిన డైలాగ్స్ తో సినిమా ఫ‌స్టాప్ అంతా హాయిగా సాగుతుంది. హీరోయిన్ అందంతో పాటు అభిన‌యం ఆక‌ట్టుకుంది. హీరోయిన్‌కి చెప్పిన డ‌బ్బింగ్ కూడా బావుంది. సుమ‌న్‌, సూర్య‌, మిర్చి మాధ‌వి కీల‌క పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. హీరో హీరోయిన్స్ ఫ్రెండ్స్ పాత్ర‌లు కూడా ఆక‌ట్టుకుంటాయి. అమిత్ యాక్టింగ్ కూడా అదుర్స్.

టెక్నిక‌ల్:
ఈ సినిమాకు పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్, సినిమాటోగ్ర‌ఫీ.. హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు. ద‌ర్శ‌కుడు ఓ అంద‌మైన క‌థ‌ రాసుకోవ‌డంతో పాటు టెక్నిషియ‌న్స్, న‌టీన‌టులను డీల్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడనే చెప్పాలి. తెలంగాణ యాస‌లో ద‌ర్శ‌కుడు రాసిన మాట‌లు ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుంటాయి. నిర్మాత రాజీపడకుండా కథకు కావాల్సిన ఖర్చు పెట్టాడు.

విశ్లేష‌ణ‌:
ఇప్పటి వరకు గ్రామీణ నేపథ్యంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి ఈ భిన్నంగా తెర‌కెక్కించ‌డంలో డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ఫ‌స్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగుతుంది. అయితే సెకండాఫ్ మీద ఇంకాస్త శ్ర‌ద్ధ పెట్టాల్సిందని అనిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డ మిన‌హా రెండు గంట‌ల పాటు ప్రేక్షకుల‌ను మెప్పించడంలో డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యాడనే చెప్పాలి. `ఆనందంగా ఉండాలంటే ఆస్తులు కాదు.. ప్రేమ ఉండాలి“ పెద్ద‌లు ప‌ట్టింపుల‌కు పోకుండా పిల్ల‌ల మ‌న‌సులు అర్థం చేసుకోని వారి ప్రేమ‌ను అంగీక‌రించాలి. బ‌తికినంత కాలం క‌లిసిమెలిసి బ‌త‌కాలి అంటూ ద‌ర్శ‌కుడు ఇచ్చిన సందేశం చాలామందికి ఉప‌యోగ‌ప‌డుతుంది. విన‌సొంపైన పాట‌లు, అద్భుత‌మైన‌ లొకేష‌న్స్, ఆక‌ట్టుకునేలా ఉన్న హీరో-హీరోయిన్ జంట‌, సినిమాటోగ్ర‌ఫీ ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమాని చూడాల్సిందే. చాలా కాలం త‌ర్వాత స్వ‌చ్ఛ‌మైన, అచ్చ‌మైన ప‌ల్లెటూరి ప్రేమ‌క‌థతో వ‌చ్చిన చిత్ర‌మిది. ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. ఫ్యామిలీ ప్రేక్ష‌కులు, యూత్ అంతా క‌లిసి చూసేలా క్లీన్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమాగా తెర‌కెక్కింది.

 

రేటింగ్ః 3.25 /5

By admin