దుబాయ్ః
ప్రవాస తెలుగు మహిళ సుజాత ఎలాలకు దుబాయ్‌లో అరుదైన గౌరవం దక్కింది. గ్లోబల్ వుమెన్స్ ఎంపవర్‌మెంట్ – నారీ శక్తి 2023 అవార్డును సుజాత ఎలాల అందుకున్నారు. 13వ ఇంటర్నెషనల్ పీస్ అవార్డు, యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు కార్యక్రమం ద వెస్టిన్ మైన సెయహి బీచ్ రిసోర్ట్స్ మెరినా- దుబాయ్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో సుజాత ఎలాలకు అవార్డును అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ రాజ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ మజిద్ బిన్ సయిద్ అల్ న్వాయిమి, షేక్ హుమైద్ బిన్ ఖలిద్ అల్ ఖ్వస్మీ, షేఖ లమిస్ బిన్తు హమాద్ బిన్ అలి అల్ మౌల, షేక్ అబ్దుల్లా బిన్ మజిద్ బిన్ సయిద్ అల్ న్వమీ, సుహైల్ మహ్మద్ అల్ జరీనితో పాటు సితమర్తీ(బీహార్) ఎంపీ సునీల్ కుమార్ పిన్టు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.దుబాయ్‌లో ఉంటున్న తెలుగు ఎన్నారై సుజాత.. భర్త రామచందర్ రెడ్డి సపోర్టుతో అలి అల్ కెండి ఇంటరియర్ డిజైన్ ఆండ్ డెకర్ బిజినెస్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. ఉమెన్ ఎంటర్‌పెన్యునర్‌గా అమె సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. బిజినెస్ పర్సన్‌గానే కాదు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు సుజాత. తెలుగు రాష్ట్రాలతోపాటు గల్ఫ్‌లో ఉండే తెలుగువారికి అవసరమైన సాయం అందిస్తున్నారు. తెలుగు వారి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews