చిత్రం: సిరిమల్లె పువ్వా..
విడుద‌ల తేదీ: ఫిబ్ర‌వ‌రి 10, 2023
స‌మ‌ర్ప‌ణ: సోను
షకీరా మూవీస్

న‌టీన‌టులు: శ్రీకర్, శ్రావణి, అజయఘోష్, స‌ఫీ ఖ్వాద్రీ, జయ నాయుడు, శ్యామ్, కళ్యాణ్, రాజేశ్వరి, ఓంకర్నాథ్

టెక్నిషియ‌న్స్:
నిర్మాత:
కౌసర్ జహాన్

ర‌చ‌యిత‌, దర్శకుడు:
గౌతం మైల‌వ‌రం

ఎడిటర్: నందమూరి హరి
DOP: సత్యానంద్-వి
సంగీతం: జీబు
సింగ‌ర్స్: బి. సౌజన్య, బి.శిరీష
డాన్స్: అనిష్

అల‌నాటి న‌టి శ్రీదేవి నటించిన ”సిరిమల్లె పువ్వా..” పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అలాంటి మంచి టైటిల్ తో వచ్చిన చిత్రం ‘సిరిమల్లె పువ్వా’. రాజకీయ నేపథ్య ప్రేమకథగా రూపొందిన ”సిరిమ‌ల్లె పువ్వా..” ఫిబ్ర‌వ‌రి 10న‌ విడుద‌లైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

క‌థ‌:
మంత్రి విజయేంద్ర ప్రసాద్ (స‌ఫీ ఖ్వాద్రీ) ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమాన్ని చూసేవాడు. ఆయ‌న‌కు మంచి పేరు ఉంది. ఎమ్మెల్యే దుర్గారాయుడు (అజ‌య్ ఘోష్‌)కు మంత్రి కావాల‌నే ఆశ ఉంటుంది. ఆయనకు ఉన్న ఏకైక అడ్డంకి విజయేంద్ర ప్రసాద్, అందుకే విజయేంద్ర ప్రసాద్‌ని తన మంత్రి పదవికి రాజీనామా చేసేలా ప్లాన్ చేస్తాడు. ఈ క్ర‌మంలో అతను గిరిజన అమ్మాయి మల్లి(శ్రావ‌ణి)ని ప్రేమిస్తున్న విజయేంద్ర ప్రసాద్ కొడుకు మహేష్‌(శ్రీ‌క‌ర్‌)ని ఉపయోగించుకుంటాడు. గిరిజన నేపథ్యంలో అటు రాజకీయం – ఇటు ప్రేమ కథ ఎలా సాగుతుంద‌నేదే ఈ సినిమా.

ఓ నిస్వార్ధ నాయకుడి రాజకీయ జీవన ప్రవాసంలోకి, ఆయన కొడుకు హృదయంలోకి అడుగుపెట్టిన ఓ అడవిమల్లి, జీవితంలో మరొక దుష్ట రాజకీయ నాయకుడి చెరను చేధించుకొని ఆయన కబంధ హస్తాల నుంచి బయటపడి ఓ స్వచ్ఛమైన సిరిమల్లెలా ఎలా విరిసి వికసించిందనే అంశాలను చాలా బాగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు గౌతం మైలవరం. గిరిజన నేపథ్యంలో రాజకీయాల మ‌ధ్య ఓ ప్రేమ‌క‌థ‌ను గౌతం రాసుకున్న విధాన‌మే సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు. తను మంచి కథ రాసుకొని సినిమా తీయాల‌నే త‌ప‌న‌తో తన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు గౌతం. త‌న క్రియేటివిటీ ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

న‌టీన‌టుల ఫ‌ర్మార్మెన్స్:
మినిస్ట‌ర్ కొడుకు మహేష్ పాత్ర‌లో శ్రీ‌క‌ర్ న‌టించాడు. ల‌వ‌ర్ బాయ్‌గా ఆక‌ట్టుకుంటాడు. వెకేష‌న్ మీద ఫారిన్ నుంచి ఇండియాకు వ‌స్తాడు. తండ్రితో పాటు గ్రామాలు ప‌ర్య‌టిస్తాడు. ఈ క్ర‌మంలో ఓ గిరిజ‌న గ్రామంలో అందమైన అమ్మాయి ‘మల్లి’ని చూసి, ప్రేమలో పడతాడు. ఈ స‌న్నివేశాలన్నింటిలోనూ శ్రీ‌క‌ర్ త‌న న‌ట‌న‌కు మంచి మార్కులే వేసుకున్నాడు. ఇక గిరిజ‌న అమ్మాయిగా మ‌ల్లి పాత్ర‌లో శ్రావ‌ణి చ‌క్క‌గా కుదిరింది. ఒక‌ప్ప‌టి ‘సిరిమ‌ల్లె పువ్వులా.. శ్రీ‌దేవి’ని గుర్తుకు తెచ్చింది శ్రావ‌ణి. సంక్షేమ మంత్రి విజయేంద్ర ప్రసాద్ పాత్ర‌లో స‌ఫీ ఖ్వాద్రీ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. నెగిటివ్ రోల్‌లో ఎమ్మెల్యే దుర్గారాయుడు పాత్ర‌లో అజ‌య్ ఘోష్ న‌ట‌న మ‌రో లెవ‌ల్‌లో ఉంది. సినిమాకు బ‌ల‌మైన పాత్ర‌ను అంతే బ‌లంగా న‌టించి మెప్పించాడు. ఇక ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించిన జ‌య‌నాయుడు, శ్యామ్, క‌ళ్యాణ్‌, రాజేశ్వ‌రీ, ఓంకార్‌నాథ్.. త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

టెక్నికల్ టీమ్‌:
ఈ సినిమాలో అన్ని విభాగాల్లో క్వాలిటీ క‌నిపిస్తుంది. నిర్మాత‌ కౌసర్ జహాన్ ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. ఈ సినిమాను చూస్తే ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం ఏంటో తెలుస్తుంది. తను రాసుకున్న కథను శ్ర‌ద్ధ‌గా, ఆక‌ట్టుకునే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు గౌతం. రాజ‌కీయంలో స్వ‌చ్చ‌త – క‌ల్మ‌షం మ‌ధ్య ప్రేమ క‌థ‌ను చెప్పిన విధానంలో సక్సెస్ అయ్యాడు. ఇక జీబు అందించిన‌ మ్యూజిక్ తో సినిమాకు మ‌రో హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు. గిరిజ‌న గ్రామంలో జ‌రిగే అంద‌మైన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన‌ డీవోపీ స‌త్య‌నంద్‌ను అభినందించాలి. మంచి విజువల్స్ అందించారు. ఇక‌ నంద‌మూరి హ‌రి ఎడిటింగ్ ఫ‌ర్‌ఫెక్టుగా ఉంది.

మొత్తానికి ఈ సినిమాతో డైరెక్ట‌ర్ గౌతం ఓ మంచి మెసెజ్‌ను ఇచ్చాడు. ప్రజలను దోచుకోవడం కాదు, ప్రజలను కాచుకునే నాయకుడిగా.. గెలవాలని, నిలవాలని, మిగలాలనీ, తలచే, తపించే ఓ నిస్వార్ధ నాయకుడి కథాంశాన్ని మ‌న ముందు ఉంచాడు. ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

రేటింగ్ 3.5 / 5

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

—————————-

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin