చిత్రం: ‘మిస్టర్ కళ్యాణ్’
విడుద‌ల‌: మార్చి 10, 2023
సమర్పణ: శ్రీమతి ఉషశ్రీ
బ్యానర్: శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్
నటీనటులు: కృష్ణ మాన్యం, అర్చన, సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్, రాజ్ వర తదితరులు.
డైరెక్టర్: పండు
నిర్మాత: ఎన్. వి. సుబ్బారెడ్డి
సంగీతం: సుక్కు
సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి
ఎడిటర్: వినోద్ అద్వయ్
డాన్స్: అనీష్
ఫైట్స్: మల్లేష్

మాములు క‌థ‌ల‌కు భిన్నంగా కాల్ బాయ్ క‌థ‌ను తెర‌కెక్కించిన తెలుగు చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. నిర్మాత సుబ్బారెడ్డి నిర్మించిన‌ ఈ ప్ర‌యోగాత్మ‌క స‌బ్జెక్టు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిందా? సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథ:
వైజాగ్ సిటీలో ఉంటున్న కళ్యాణ్ (కృష్ణ మాన్యం) ఒక కాల్ బాయ్ బాయ్‌. కళ్యాణ్ కాల్ బాయ్‌గా పనిచేస్తున్నాడని తన తల్లిదండ్రులకు, అతని ల‌వ‌ర్ సారికకు తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాడు. అదే సిటీలో చాపెల్ (సప్తగిరి) ఒక కార్పొరేట్ వ్యవస్థ పెట్టి కాల్ బాయ్ కంపెని నిర్వ‌హిస్తాడు. ఈ క్రమంలో చాపెల్ తన కంపెనీలో జాన్ అవ్వమని కళ్యాణ్ ను అడుగుతాడు. కానీ కళ్యాణ్ నో చెబుతాడు. కళ్యాణ్ కాల్ బాయ్ గా చేస్తున్న ఒకానొక సందర్భంలో తన ల‌వ‌ర్‌ సారిక (అర్చన) కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతాడు. ఆ తరువాత సారిక – కళ్యాణ్ మ‌ధ్య ఏం జ‌రుగుతుంది? కళ్యాణ్, చాపెల్ చివరికి ఏమయ్యారు? అసలు కళ్యాణ్ కాల్ బాయ్ గా ఎందుకు మారాడు? వంటి విషయాలు తెలియాలంటే మిస్టర్ కళ్యాణ్ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పర్ఫామెన్స్:

హీరో మాన్యం కృష్ణ నటన సినిమాకు హైలైట్. ఎమోషన్స్, ఫైట్స్, యాక్టింగ్.. ఇలా మొత్తం అతని భుజాల పైన మోసాడు. ఫ‌స్ట్ సినిమాకే యాక్టింగ్ ఈ రేంజ్ చేసిన ఇత‌నికి మంచి కెరీర్ ఉంటుంద‌ని చెప్పుకోవ‌చ్చు. చూడడానికి కూడా ఆరు అడుగుల ఎత్తుతో, ‌ మంచి కటౌట్ తో ఉన్నాడు. మన తెలుగు సినిమాకి సరిగ్గా దర్శకులు వాడుకుంటే ఒక సూపర్ యాక్షన్ హీరో దొరికేశాడు అనిపించుకున్నాడు ఈ రాయలసీమ కుర్రోడు. ఇక‌ సప్తగిరి తనదైన కామెడీ టైమింగ్ తో న‌వ్విస్తాడు. సప్తగిరికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పాత్రల్లో నటించిన ధనరాజ్, బాబీ వారి పాత్రల్లో బాగా నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తారు. ఇక‌ హీరోయిన్ అర్చన.. సారిక పాత్రలో చాలా బాగా న‌టించింది.

టెక్నిక‌ల్ టీమ్ ప‌నిత‌నం:
డైరెక్ట‌ర్ పండుకు ఫస్ట్ మూవీ అయినప్పటికీ అనుభవం కలిగిన దర్శకుడిలా సినిమాను తెర‌కెక్కించాడు. అలాగే పాత్ర‌ల‌న్నింటిని మ‌లిచిన తీరు కూడా బాగుంది. తాను రాసుకున్న కథ కథనాలు స్క్రీన్‌ మీద చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ నిలబడ్డాడని చెపొచ్చు. సుక్కు మొత్తం 5 పాటలను బాగా ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్ల‌స్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక విజువ‌ల్స్‌ను ఎంతో చ‌క్క‌గా చూపించ‌డంలో నానాజి, ఎమ్.వి.గోపి పనితనం సూప‌ర్. వారి కెమెరా వర్క్ తో సినిమాను మ‌రో లెవెల్‌కు తీసుకెళ్లారు. డైరెక్టర్ పండు, కెమెరామెన్స్ నానాజి, ఎమ్.వి.గోపి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ కొత్తవల్లే అయినప్పటికీ అనుభవం కలిగిన టెక్నిషన్స్ లా చేసి ఈ సినిమాను నిలబెట్టారు. ఇక‌ ఎడిటర్ వినోద్ అద్వయ్ సినిమా వర్క్ బాగుంది. ఫైట్స్ కూడా బాగున్నాయి. షావాలింన్ మల్లేష్ మాస్టర్ కంపోజ్ చేసిన నాలుగు ఫైట్స్ ప‌ర్‌ఫెక్ట్‌. ఇక‌ 4 పాటలు వేర్వేరు లొకేషన్స్ లో తీసి క్వాలిటీతో మెప్పించారు. అనిష్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

విశ్లేషణ:
స్త్రీ వేశ్య‌ల‌పై తెలుగులో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి కానీ, ఒక మ‌గ వ్య‌భిచారిపై తీసిన ‘మిస్టర్ కళ్యాణ్’ తెలుగు సినిమాల్లో ఒక ప్ర‌యోగంగా చెప్పుకోవ‌చ్చు. ఈ సినిమా ఫ‌స్ట్ హాఫ్ అంతా ఎంట‌ర్‌టైన్మెంట్‌గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, త‌ర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ‌ కలుగుతుంది. సెకండ్ హాఫ్ హ్యూమన్ ఎమోషన్స్, బంధాలు వాటి విలువల గురించి చూపించిన విధానం ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. స‌బ్జెక్టుకు త‌గ్గ‌ క్వాలిటీ వ‌చ్చింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. నిర్మాత ఎన్.వి. సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మిస్టర్ కళ్యాణ్ సినిమాను నిర్మించిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది.

ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్, వాల్యూస్, మెసేజ్ ఈ సినిమాలో బాగున్నాయి. ఈ త‌రం యూత్‌కే కాదు అన్ని వర్గాల వారికి నచ్చే చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో.. అంద‌రూ చూడ‌ద‌గిన సినిమాగా చెప్పుకోవ‌చ్చు.

రేటింగ్ 3.25 / 5

***

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin