దర్శకుడు రామ్ రెడ్డి పన్నాలతో ఇంటర్వ్యూ
ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా నిలబడే వారు కొందరే. ఆడియన్స్ ఇప్పుడు ఏ తరహా కంటెంట్‌కు కనెక్టు అవుతారో తెలుసుకుని అలాంటి కటౌట్‌ను నిలబెట్టాలి. అప్పుడే సూపర్ హిట్టు కొట్టొచ్చు. బొమ్మ బ్లాక్‌బస్టర్ చేయోచ్చు. అలాంటి సత్తా ఉన్న వర్థమాన దర్శకుల్లో ‘రామ్ రెడ్డి పన్నాల’ ఒకరు. సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎలాంటి సమస్యతో ప్రధానంగా నష్టపోతోందో, ఆ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని, దాని చుట్టూ అల్లుకున్న కథనం, ఎంగేజింగ్ నడిపించడంలో ఇటీవల విడుదలైన ‘నేడే విడుదల’ సినిమాతో దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల విజయం సాధించారు. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన దర్శకుడు రామ్ రెడ్డి పన్నాలతో స్పెషల్ ఇంటర్వ్యూ.
ప్రశ్న: నమస్తే.. రామ్ రెడ్డి పన్నాల గారు.. ‘నేడే విడుదల’ సినిమాతో మీరు ఇండస్ట్రీలో అందరి దృష్టిలో పడ్డారు. ముందుగా మీ నేపథ్యం గురుంచి చెప్పండి.
సమాధానం: నమస్తే అండీ, మాది జగిత్యాల జిల్లాలోని లక్ష్మిపూర్ గ్రామం. మాది రైతు కుటుంబం. అమ్మ, నాన్న వ్వవసాయదారులు. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఈ రంగానికి వచ్చాను.
ప్రశ్న: మీరు తీసిన ‘నేడే విడుదల’ టైటిల్ చాలా క్యాచీగా ఉంది.. ఏ జానర్ లో తీశారు?
సమాధానం: అవునండి.. ‘నేడే విడుదల’ టైటిల్‌తోనే ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో పాటు, మంచి మెసేజ్ కూడా వుంది.
ప్రశ్న: ‘నేడే విడుదల’ విడుదలయ్యాక రెస్పాన్స్ ఎలా ఉంది? అన్ని ఏరియాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది?
సమాధానం: సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుంది అని చెబుతున్నారు. సినిమాలో ముఖ్యంగా కామెడీ నచ్చి చాలా మంది ప్రేక్షకులు రిపీట్‌గా చూస్తున్నారు. సినిమా విడుదలయ్యాక అన్ని కేటగిరి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాలే చేయలంటూ చాలా మంది నుంచి నాకు కాల్స్, మెసెజ్‌లు వచ్చాయి. ఈ మూవీ పూర్తిగా ఫ్యామిలీ కామెడీ డ్రామా. అందుకే అందరికి నచ్చింది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా జగిత్యాల లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
ప్రశ్న: ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. మీరు.. ఎవరి దగ్గరైన దర్శకత్వ శాఖలో పనిచేసారా?
సమాధానం: నేను డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అలాగే డైరెక్టర్ మారుతీ టాకీస్‌లో కో-డైరెక్టర్ గా పనిచేసాను. నాకు డైరెక్టర్ సుకుమార్ అంటే చాలా ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే సుకుమార్ గారికి ఏకలవ్య శిష్యుడిని.
ప్రశ్న: మున్ముందు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?
సమాధానం: సినిమాకు వచ్చిన ప్రేక్షకుడిని ఆనందింపజేయడం ముఖ్యమనుకుంటాను. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మెసెజ్ అందించాలనుకుంటాను. ప్రేక్షకులు ఆనందపడేలా, ఆలోచింపజేసేలా వుండే సినిమాలు చేయాలనుకుంటున్నాను.
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
—————————-
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews