భూమి దద్దరిల్లేలా.. ఒంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా…
దుమ్ము దుమ్ము దులిపేలా..
లోపలున్న పాణమంతా దుముకు దుముకులాడేలా…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు..
అంతలా విశ్వ సినీ ప్రేమికుల మనసుల్లో ‘నాటు’కు పోయింది.
ఇప్పుడు ఆస్కార్ సాధించి విశ్వవిజేతగా నిలిచింది.
పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పాట‌ను రాసి ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేపించాడు చంద్రబోస్.

– స్వామి ముద్దం

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉంటుంది. ఇక హాలీవుడ్ నటీనటులైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో మన తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును తొలిసారి గెలుచుకుంది. ఒక భారతీయ సినిమా బెస్ట్ ఒరిజినల్ క్యాటగిరిలో అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి. ఒక్క RRR మాత్రమే కాదు.. 2023 ఆస్కార్‌లో పలువురు తొలిసారి ఈ అవార్డు అందుకున్నారు. RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు RRR టీమ్‌కు అభినందనలు, శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

ఈ సందర్భంగా RRRలోని నాటు నాటు పాట రాసిన చంద్రబోస్ గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందు పరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టే విధంగా చంద్రబోస్ ఈ పాటను రాశారు. ముఖ్యంగా తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత, నాటి ఉమ్మడి వరంగల్ (ప్ర‌స్తుతం జయ శంకర్ భూపాలపల్లి జిల్లా) చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్‌ ఇపుడు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ అవార్డు అందుకున్నారు.

నేప‌థ్యం ఇలా..
పూర్తి పేరు కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్. చంద్రబోస్ జ‌న్మించింది ఉమ్మడి వరంగల్ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా ఉన్న చల్లగరిగ అనే ఊరు. ఇంజనీరింగ్ చేసిన చంద్రబోస్ కు మొదట్నుంచి సాహిత్యం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే సినిమా ఇండస్ట్రీలో రావడానికి బాగా ప్ర‌య‌త్నం చేసి దూరదర్శన్‌లో సింగర్‌గా జాయిన్ అయ్యాడు. స్నేహితుడి స‌హాయంతో సినిమా ఇండస్ట్రీలో ఎంటరయ్యాడు. ప్రారంభంలోనే రామానాయుడు నిర్మాణంలో ముప్పలలేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాజ్ మహాల్’ సినిమాల… మంచు కొండల్లోన చంద్రమా అనే సూపర్ హిట్ పాట రాసి అందర్నీ ఇంప్రెస్ చేశాడు.

పెళ్లి పీటలు అనే సినిమా చేస్తున్నపుడే కొరియోగ్రాఫర్ సుచిత్రను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చంద్రబోస్. ఆ తర్వాత ఆయన కెరీర్ ఇంకా స్పీడ్ అందుకుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు కెరాఫ్ అడ్రస్ అయిపోయాడు. శ్రీ మంజునాథ, శిరిడి సాయి లాంటి భక్తి సినిమాలకు కూడా మంచి మంచి పాటలు రాసి ఆల్ రౌండర్ అని ప్రూవ్ జేసుకున్నాడు. మౌనంగానే ఎదగమనీ,పెదవే పలికిన మాటల్లోన, నేనున్నానని, పంచదార బొమ్మ బామ్మ లాంటి ఎన్నో పాటలు చంద్రబోస్ కి మంచి పేరుని తీసుకొచ్చాయి. తాజ్ మహల్ సినిమా ద్వారా తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత బావగారు బాగున్నారా, పెళ్లి సందడి, ప్రేమంటే ఇదేరా, మాస్టర్ ఇలా ఎన్నో మంచి హిట్లు అందుకున్న స్టార్ హీరోల సినిమాలలో పాటలు పాడి మంచి పేరు సంపాదించుకున్నాడు చంద్రబోస్. తెలుగు సినీ సింగర్ చంద్ర బోస్ గురించి, ఆయన పాడే పాటల గురించి అందరికీ సుప‌రిచిత‌మే. ఇక పాటల రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాలలో పాటలు పాడి భారీ అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తెలుగు సినీ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సుచిత్రాను పెళ్లి చేసుకున్నారు.

ఇక తన మొదటి పాటను బాలు, చిత్ర పాడారట. చంద్రబోస్ 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తానే సొంతంగా వార్తలు రాసి న్యూస్ పేపర్ నే స్టార్ట్ చేశారు. తన తల్లిదండ్రులు వాళ్ళ పనుల నుండి ఇంటికి వచ్చాక వారి మాటలను జాగ్రత్తగా విని వాటిని రాసుకొని తమ ఇంటి పక్కన ఉన్న ఒక గ్రంథాలయంలో రాసుకున్న పత్రికలు వేసేవారు. తమ ఊరి పెద్దలు అందరూ వచ్చి తన పత్రికను మొదటిగా చదివేవారట.

సుకుమార్ సినిమా వన్ నేనొక్కడినే లో యు ఆర్ మై లవ్ పాటకు తనకు 29 రోజులు పట్టిందని తెలిపాడు. ఇక అదే దర్శకుడి సినిమా రంగస్థలంలో ఒక్కో పాటకు 30 నిమిషాలు పట్టిందని తెలిపాడు. ఒక్క పాట కూడా పేపర్ పై రాయకుండా పాడాడట. ఇక తను పాడిన ఒక పాటకు రెహమాన్ పొగిడాడని తెలిపాడు చంద్రబోస్. ఆలీ కోసం కూడా ఒక పాట పాడి వినిపించారు చంద్రబోస్. తనను ఇండస్ట్రీలో పాట పాడక ముందే ఒకరు విమర్శించారని తెలిపాడు. అటు RRR సినిమాలో నాటు నాటు కూడా రోజు వ్యవధిలోనే రాసేశారు చంద్రబోస్.

ఇక సినీ ఇండస్ట్రీలో పాటలు రాసేవాళ్ల మధ్య ఫుల్ కాంపిటీషన్ నడుస్తోంది. రోజుకో రచయిత పుట్టుకొస్తనే ఉన్నారు. అయినాసరే.. చుక్కల్లో సంద్రుడిలా.. ఎంతమంది పాటల రచయితలు పోటికొచ్చినా.. తనదైన స్టైల్‌తో లిరిసిస్ట్ గా టాప్ పోజిషన్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు తెలంగాణ బిడ్డ చంద్రబోస్. దాశరథి, నారాయణ రెడ్డి, సుద్దాల అశోక్ తేజ తర్వాత తెలుగు సినిమాలో తెలంగాణ పాటల రచయతగా టాలెంట్ ఏమిటో సూపెడున్నాడు చంద్రబోస్.

చంద్రబోస్ ఇప్పటిదాక దాదాపు ఏడు వందల సినిమాలకు పైనే.. 2500 వేల పాటల వరకు రాశాడు. ఇక ఆయన ఆది సినిమాకు రాసిన ‘నీ నవ్వుల తెల్లదనాన్ని, నేనున్నాను చిత్రంలో చీకటితో వెలుగే చెప్పెను పాటలకు నంది అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి.. కష్టమైన పదాలను వాడకుండా.. అందరికీ అర్థమయిట‌ట్లు సులువుగా రాసి సూపర్ అనిపించుకోవడం చంద్రబోస్ ప్ర‌త్యేక‌త‌. అందుకే.. ఇప్పటికి.. పెద్ద సినిమాలకు పాటలు రాయాలంటే.. ఫస్ట్ చంద్రబోస్ పేరే వినిసిస్తోంది. తాజాగా RRR సినిమాకు ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. ఈయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని మ‌న‌మంతా కోరుకుందాం.

***

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

—————————-

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin