– వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించండి – గెలిచి చూపిస్తాం
– ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం.
– విజయవంతమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమావేశం
కామారెడ్డి: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత వెనుకబడ్డ దళిత ఉపకులాలకు ఆరు స్థానాలు కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి అధికార,ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేసారు. ఈరోజు కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ సమావేశంలో అయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి దళితులలో 34శాతం ఉన్న 57ఎస్సీ ఉపకులాలు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈనాటికి రాజకీయ అధికారం పొందలేదని చట్టసభల్లో మా గొంతు వినిపించే నాయకుడు లేరని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో ఉపకులాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని దళితబందు లో ఉపకులాలు ఒక్క శాతం కూడా పొందలేదని, దళితబందులో ఉపకులాలకు 40శాతం కేటాయించాలని, కులధ్రువీకరణ పత్రాలు ఆర్డీవో ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు నిరగొండ బుచ్చన్న గోసంగి, రాయిల లక్ష్మి నర్సయ్య చిందు, పోచయ్య హోలీయదాసరి, బాణాల తిరుపతి డక్కలి, దొంబర బాలరాజు, మటపతి నాగయ్య బేడజంగం, మల్లెల సాయి చరణ్ గోసంగి, పస్తo నరహరి బుడగజంగం, బోరంచ రాజలింగం మాలజంగం, పురాని అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సి ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా పస్తం పర్శరాములు
కామారెడ్డి పట్టణంలో జరిగిన ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా పస్తం పర్శరాములు గోసంగి, ప్రధాన కార్యదర్శిగా సుంకరిపల్లి సాయన్న గోసంగి, ఉపాధ్యక్షులుగా బాణాల తిరుపతి డక్కలి, పురాని అజయ్ బేడాజంగం, అబ్బీణమైన పోచయ్య హోలియదాసరి, బోరంచ రాజలింగం మాలజంగం, గడ్డం గంగ సాయిలు చిందు, కొండలేపు శంకర్ మోచి, ఈర్నాల రమణ గోసంగి, కోశాధికారి గా అంకమల్ల శంకర్ గోసంగి, కార్యవర్గ సభ్యులు గా సంకు పోచయ్య బాణాల రవి డక్కలి, కస్తూరి మహేష్ మాలజంగం, కడమంచి హన్మాండ్లు, సలహాదారులుగా గంధం బుద్దిరాజు ను ఎన్నుకున్నట్లు తెలిపారు.
***
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews