◉ రాజకీయ శక్తిగా గల్ఫ్ కార్మికులు
◉ భారీ నామినేషన్లకు సన్నాహాలు
◉ ఈసారి ఎన్నికల్లో గల్ఫ్ దెబ్బ గట్టిగానే
◉ 32 నియోజకవర్గాల్లో గల్ఫ్ అలజడి

వారి క‌న్నీరు తుడిచే నాయ‌కుడు లేడు..
ఉపాధి అందిస్తామ‌ని ముందుకొచ్చే ప్ర‌భుత్వ‌మూ లేదు..
పిట్ట‌ల్లా రాలిపోతున్నా ప‌ట్ట‌న్న‌ట్టు ఉంటున్నారు పాల‌కులు..
ఆ నిస్సాహ‌య జీవుల్లో క‌ద‌లిక వ‌స్తోంది.. వ్య‌తిరేకంగా ఉన్న వ్య‌వ‌స్థ‌పై క‌సి పెరుగుతోంది..
రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసి పెద్ద గ‌ద్ద‌ల‌ను నేల‌కు దించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు..
గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల భార్యలు (గల్ఫ్ విడోస్) వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి గల్ఫ్ శ్రామికుల హక్కుల ఉద్యమకారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గల్ఫ్ రిటనీలు, గల్ఫ్ కార్మిక కుటుంబాల సంఖ్య అధికంగా ఉన్న 32 అసెంబ్లీ సెగ్మెంట్లలో ‘గల్ఫ్ విడోస్’ తో పాటు గల్ఫ్ బాధితుల కూడా భారీగా నామినేషన్లు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ ఆలోచన ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు దారితీయనున్నది.

గల్ఫ్‌లో 1,800 మంది చనిపోయారు
సంవత్సరానికి 200 మంది చొప్పున గత తొమ్మిదేళ్లలో గల్ఫ్ దేశాలలో తెలంగాణ వలస కార్మికులు 1,800 మందికి పైగా చనిపోయారు. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో శవపేటికల రవాణాకు అనుమతి ఇచ్చే రిజిస్టర్ ఇందుకు సాక్ష్యం.

గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని మాట తప్పినందుకు కేసీఆర్ పై గల్ఫ్ మృతుల కుటుంబాలు కోపంగా ఉన్నాయి. కరోనా కష్ట కాలంలో హోటల్ క్వారంటయిన్ పేరిట రూ.8 వేల చొప్పున వసూలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంపై, అధిక విమాన చార్జీలు వసూలు చేసినందుకు కేంద్ర ప్రభుత్వంపై గల్ఫ్ రిటనీలు గుర్రుగా ఉన్నారు.

రాజకీయ పోరాటం
బతుకుదెరువు కోసం గంపెడాశతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వలస జీవుల గోడును బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోవడం లేదు. తమ సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ శ్రామికులు రాజకీయ పోరాట పంథాను ఎంచుకున్నారు. అధికార, విపక్ష పార్టీల చుట్టూ తిరిగి విసిగి వేసారిన గల్ఫ్ వలస జీవులు ఎన్నికలను ఎత్తుగడగా… గల్ఫ్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని సమాయత్తం అవుతున్నారు. గల్ఫ్ జేఏసి,  గల్ఫ్ వర్కర్స్  పొలిటికల్ ఫోరం, వివిధ కార్మిక, ప్రజా సంఘాలతో, మేధావులతో చర్చలు జరుపుతున్నారు.

గల్ఫ్‌ దేశాలలో తెలంగాణ కూలీలు 15 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా. గత పదేళ్లలో ఎడారి దేశాల నుండి మరో 15 లక్షల మంది వాపస్ వచ్చి గ్రామాలలో సరైన ఉపాధి లేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక వనరులతో పరిశ్రమలు ఏర్పాటు, వ్యవసాయ రంగానికి మద్దతు ఇస్తే వలస సమస్యలు కొంతవరకు తీరేవి. వీరందరి కుటుంబ సభ్యులు కలిస్తే ఒక కోటి వరకు గల్ఫ్ ఓటు బ్యాంకు ఉన్నది. తెలంగాణలో 32 అసెంబ్లీ నియోజకవర్గాలలో గల్ఫ్ కుటుంబాల ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నట్లు పలువురు రాజకీయ వ్యూహకర్తలు ఇదివరకే ఆయా పార్టీలకు తేల్చి చెప్పారు.

కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ ఇవ్వనందుకు బీఆర్ఎస్ పై  గల్ఫ్ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడం ఒక ఆలోచన కాగా, బీజేపీ, కాంగ్రెస్,  బీఎస్పీ, ఫార్వర్డ్  బ్లాక్ పార్టీలు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పడం మరో కోణం.

32 గల్ఫ్ ప్రాబల్య సెగ్మెంట్లు
అధిక ప్రభావం గల అసెంబ్లీ నియోజకవర్గాలు: నిర్మల్, ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి (ఎస్సీ), ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్

ఒక మోస్తరు ప్రభావం గల అసెంబ్లీ నియోజకవర్గాలు: ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు (ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్తల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి

గల్ఫ్ లో ఉన్నా.. ఊరిలో పట్టు  
సప్త సముద్రాలు దాటి గల్ఫ్‌ దేశాలకు వలసపోయిన కార్మికుల ఓటు బ్యాంకు.. తెలంగాణ గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్ లో రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తోంది. గెలుపోటములను శాసించే సత్తా ఉన్న గల్ఫ్‌ కుటుంబాలపై ప్రధాన విపక్ష రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ దృష్టి సారించాయి. బీఆర్ఎస్ మాత్రం గల్ఫ్ కుటుంబాలను లెక్కలోకి తీసుకోవడం లేదు.

తిరగబడ్డ ఉద్యమ నినాదం 
తెలంగాణ ఉద్యమ సమయంలో… బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి అనే నినాదం ఒక పవర్ ఫుల్ మిస్సయిల్ లాగా పనిచేసింది. ఇప్పుడు… అదే మిస్సయిల్ తిరగబడింది. కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందున బీఆర్ఎస్ పార్టీకి గల్ఫ్ కార్మికుల కుటుంబాలు దూరమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చూపడానికి సిద్ధం అవుతున్నారు.

– మంద భీంరెడ్డి,
వలస వ్యవహారాల విశ్లేషకులు

 

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin