– దళితబంధు పథకంలో ఎస్సీఉపకులాలకు 40 శాతం కేటాయించాలి
– ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్

సిద్దిపేట:
అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు రెండవ విడత “దళితబందు”లో 40శాతం కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్ చేసారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన “ ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశం”లో అయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నిపథకాలలో ఎస్సీలలో ఉన్న 57 ఉపకులాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని మొదటి విడత “దళితబందు”లో ఉపకులాలు ఒక్క శాతం కూడా లబ్ది పొందలేదని, అవి కేవలం మాల, మాదిగ కులాలు అందులో అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే దక్కాయని, అందులో కూడా స్థానిక నేతలకు కమిషన్లు ఇచ్చిన వారికే దళితబంధు దక్కిందన్న విషయం అన్నీ వార్తా పత్రికల్లో ప్రధాన వార్తగా నిలిచిందని కావున దళితుల అభివృద్ది పై చిత్తశుద్ది ఉంటే దళితులలో అత్యంత వెనుకబడిన మోచి, చిందు, హోలియ దాసరి, మాలజంగం, బేడ బుడగజంగం, సమగర, బైండ్ల, డక్కలి, గోసంగీ, బ్యాగరి, మష్టిన్, దొంబరా, మిథ అయ్యావార్లు మొదలైన ఎస్సీ 57 ఉపకులాలకు రెండవ విడత “దళితబందు”లో 40శాతం కేటాయించాలని అన్నారు. ఈ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి దళితులలో 34శాతం ఉన్న 57ఎస్సీ ఉపకులాలు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈనాటికి రాజకీయ అధికారం పొందలేదని చట్టసభల్లో మా గొంతు వినిపించే నాయకుడులేరని అన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత వెనుకబడ్డ దళిత ఉపకులాలకు ఆరు స్థానాలు కేటాయించాలని అధికార ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేశారు. కులధ్రువీకరణపత్రాలు ఆర్డీవోద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇచ్చేవిధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాయిల లక్ష్మినర్సయ్య చిందు, పస్తం నరహరి బుడగజంగం, ఉమ్మడి జిల్లా నాయకులు శాఖమూరి యాదగిరి హోలియదాసరి, పిన్నింటి దాసు చిందు, ఎర్పుల నాగరాజు, మాలజంగం, దేవరాజు మాదిగజంగం, బైండ్ల మల్లేశం, బాబు బైండ్ల, కొల్లేపు ప్రభాకర్ మోచి, బైరి శ్రీనివాస్ మోచి, కర్నెకంటి రాజు డక్కలి, మహేష్ బుడగజంగం, రవి తదితరులున్నారు.

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php 

 

By admin