• వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎస్సీ ఉపకులాలకు ఆరు స్థానాలు కేటాయించాలి.
  • దళితబంధు పథకం లో ఎస్సీ ఉపకులాలకు 40 శాతం కేటాయించాలి
  • ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్

క‌రీంన‌గ‌ర్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత వెనుకబడ్డ దళిత ఉపకులాలకు ఆరు స్థానాలు కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి అధికార,ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రెస్ భావన్లో ఏర్పాటు చేసిన “ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం” లో అయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో 22 లక్షల జనాభా కలిగి దళితులలో 34శాతం ఉన్న 57ఎస్సీ ఉపకులాలు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈనాటికి రాజకీయ అధికారం పొందలేదని చట్టసభల్లో మా గొంతు వినిపించే నాయకుడులేరని అన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో ఎస్సీఉపకులాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని “దళితబందు “లో ఉపకులాలు ఒక్క శాతం కూడా లబ్ది పొందలేదని దళితుల అభివృద్ది పై చిత్తశుద్ది ఉంటే దళితులలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకు రెండవ విడత “దళితబందు”లో ఉపకులాలకు 40శాతం కేటాయించాలని, కులధ్రువీకరణపత్రాలు ఆర్డీవోద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇచ్చేవిధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నిరగొండ బుచ్చన్న గోసంగి, ఆదిమూళ్ల వెంకటేష్ హోలియదాసరి, రాయిల లక్ష్మినర్సయ్య చిందు, బుద్దుల గంగనరసయ్యమష్టిన్, మల్లెల సాయిచరణ్ గోసంగి, కర్నె రామారావు డక్కలి, మల్లికార్జున్ మాలజంగం, గడ్డం సమ్మయ్య చిందు, పస్తo నరహరిబుడగజంగం,
తమ్మడి రాజలింగం మాలజంగం తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్ ప్రెస్ భవన్ లో జరిగిన ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి తెలిపారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా – బాణాల రాజారామ్ డక్కలి.
ప్రధాన కార్యదర్శిగా – మల్యాల శ్రీనివాస్ గోసంగి

ఉపాధ్యక్షులుగా-

1. గడ్డం సమ్మయ్య చిందు.
2.దంతెనపల్లి ధర్మయ్య మాష్టిన్.
3.తమ్మడి రాజలింగం మాలజంగం.
4.పెండ్యాల నరేష్ హోలియదాసరి.
5.సిరిపాటి వేణు బుడగజంగం
6.సోరుపాక సంతోష్ గోసంగి

కోశాధికారి గా – ముత్యాల శ్యామ్ సుందర్ గోసంగి.

కార్యవర్గ సభ్యులుగా –
1. గడ్డం తిరుపతి చిందు
2. ఔషాదం రవీందర్ గోసంగి
3. గడ్డం గంగాధర్ చిందు.

వీరిని ఎన్నుకున్నట్లు తెలిపారు.

By admin