ఎస్సీ సబ్ ప్లాన్ నిధులలో ఎస్సీ 57 కులాల వాటా ఎంతో స్పష్టం చేయాలి.
దళితులలో అత్యంత వెనుకబడిన 57 ఉపకులాలను MBSC (Most Backward Scheduled Castes ) గా గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండువేల కోట్ల నిధిని కేటాయించాలి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ ఉప కులాలకు ఆరు స్థానాలు కేటాయించాలి.
ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులలో దళితులలో అత్యంత వెనుకబడ్డ 57 ఉప కులాల వాటా ఎంతో స్పష్టం చేయాలని ఎస్సి 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఎస్సీ 57 ఉప కులాల హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆవిర్భావ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఎస్సీ ఉపకులాల జనాభా 30 లక్షలకు పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు అందే ఏ ప్రయోజనాలు కూడా వీరికి అందడం లేదన్నారు.
దళితులలో అత్యంత వెనుకబడిన పైడి,డక్కలి, మాదసి కురువ, బేడ (బుడ్గ)జంగం, బైండ్ల,చిందు, గోదారి,మోచి,మూచి, సమగర,బారికి, రెల్లి , బ్యాగరి,
మాల దాసరి, హోలీయ దాసరి మొదలైన 57 ఉప కులాలు తీవ్ర అన్యాయానికి గురైతున్నాయని కావున వీరిని అత్యంత వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు(MBSC)గా గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2వేల కోట్ల నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాల జనాభాను తగ్గించి చూపించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఎస్సి ఒక కులాలకు వ్యతిరేకరణ పత్రాలు తయారు చేయడంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం 1975లో విధించిన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఎక్కడా లేని విధంగా మెమో నంబర్. 7778/2007 ద్వారా మాల మాదిగలకు లేని నిబంధనలు ఎస్సీ ఉపకులాలకు విధించి వీరిని మరింత వివక్షతకు గురి చేస్తున్నారు. దీనివల్ల వీరు విద్యా, ఉద్యోగ, ఉపాది, రాజకీయ రంగాలలో దళితులకు అందవలసిన అవకాశాలు పొందలేక పోతున్నారు.ప్రతి జిల్లాలో ఈ కులాల ప్రజలు లక్షల్లో ఉన్నప్పటికీ వీరిని వేలల్లో, వందలల్లో రికార్డుల్లో చూపి చివరకు దళితులలో రెండే కులాలున్నాయని చూపించే కుట్ర జరుగుతుందన్నారు. ఈ విషయంపై గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ రాజ్యాంగ నిబంధనలు 14, 15 మరియు 21 కు విరుద్ధంగా ఉన్నాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే మెమో. నం.7778/2007 నీ రద్దుచేసి దళితులందరికీ కులదృవీకరణ పత్రాల జారీలో ఒకే విధానాన్ని అనుసరించాలని, క్యాస్ట్ సర్టిఫికెట్లను ఆర్డిఓ ద్వారా కాకుండా ఎమ్మార్వో ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేసారు.
ఈ రాష్ట్రంలో 30 లక్షల పైగా జనాభా కలిగి ఉన్న ఎస్సీ 57 ఉపకులాల వారికి ఎస్సీ కమిషన్ లో సభ్యులుగా అవకాశం కల్పించాలని, ఎస్సీ /ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచ్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ , వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాలు కేటాయించాలని అధికార, ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలని దళితులలో అత్యంత వెనుకబడ్డ ఉపకులాలను ప్రత్యేకంగా ” A ” కేటగిరీలో చేర్చి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని కేటాయించి అమలు చేయాలని ఇందుకోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మా సమస్యలు పరిష్కరించని పక్షంలో మా ఆత్మగౌరవ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.
రాష్ట్ర అధ్యక్షులుగా : గంట రామకృష్ణ పైడి (విజయనగరం)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా : సుంకన్న మదసికురువ (కర్నూలు ).
గౌరవ అధ్యక్షులు గా :
దూపం సత్యం బేడజంగం (విశాఖపట్నం )
న్యాయసలహాదారుగా : బరిగే అయ్యప్ప అరుణాచలం(Adv)
ఉపాధ్యక్షులుగా :
కురువ నాగరాజు మదాసి కురువ (కర్నూలు )
ఏషపోగు బాబు డక్కలి (ఒంగోలు )
అన్నపురెడ్డి జోజిబాబు దొంబర (విజయవాడ)
డాక్టర్ బి. వెంకటరమణ మోచి (విజయవాడ)
దక్షిణ కోస్తా ఆంధ్ర రీజినల్ కోర్డినేటర్ గా : చిన్న కర్నె ఎలీషా
ఎన్ని కైనట్లు జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి గారు ప్రకటించారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ త్వరలోనే అన్ని జిల్లా, మండల శాఖలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ని బలోపేతం చేస్తామని అన్నారు.
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews