పాల్వంచ నుండి ప్రగతి భవన్ కి పాదయాత్ర 

ఇల్లందు:

ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆర్ధికంగా, అనారోగ్యలకు గురి అయినా తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ నుండి ప్రగతి భవన్ కి పాదయాత్రగా బయలుదేరిన పాల్వంచ ప్రాంత ఉద్యమ నాయకులు..

 

తెలంగాణ ఉద్యమకారులసంక్షేమ సంఘము కన్వీనర్ సయ్యద్ రషీద్, తన టీమ్ సభ్యులను ఈరోజు కొత్తగూడెం జిల్లా టేకులపల్లి వద్ద అరెస్ట్ చేసి, బోడు పోలీస్ స్టేషన్, అక్కడ నుండి అల్లపల్లి పోలీస్ స్టేషన్, అక్కడ నుండి గుండాల పోలీస్ స్టేషన్ తరలించడాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఇల్లందు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి , ఈ అక్రమ అరెస్ట్ లను ఖండించారు. వెంటనే సయ్యద్ రషీద్ మరియు తన అనుచరులను విడుదల చేయాలనీ డిమాండ్ చేయటం జరిగింది.

ఈకార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమన్న, రాష్ట్ర మీడియా ఇంచార్జ్ అనంతుల మధు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాధస్ శ్రీనివాస్ రావు, 1969 ఉద్యమకారుల నాయకుడు కోయ వెంకట నారాయణ, వడ్డే బోయినా వెంకటేశ్వర్లు, వడ్త్యా రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

By admin