సుస్థిర ప్రగతికి ఎంతో కీలకమైన ఆవిష్కరణల, అంకుర పరిశ్రమల స్థాపనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణ ఐటీ రంగం అప్రతిహతంగా తన ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తున్నది. తాజా నివేదిక చూస్తే తెలంగాణ ఐటీ రంగంలో తిరుగులేని ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సారథ్యంలో, యువ ఐటి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఆకాశమే హద్దు.. అన్న రీతిలో తెలంగాణ ఐటీ రంగం దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రంపై పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి.
స్టార్టప్‌లకూ హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలో 2022 -23 సంవత్సరంలోనూ ఐటీ రంగం 31.44 శాతం వృద్ధిని సాధించడం గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. 2016లో 400 స్టార్టప్‌లతో ఉన్న టీ-హబ్ ప్రస్తుతం 2500లకు విస్తరించింది. టీ-హబ్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన 2022-23 ఐటీ వార్షిక నివేదిక చూస్తే తిరుగులేని ప్రగతి కనిపిస్తోంది. కేవలం తొమ్మిదేళ్లలో రూ. 57వేల కోట్ల నుంచి రూ.2.41 కోట్ల ఎగుమతులకు చేరుకోవడం ఓ ఘనత. ఐటీ రంగం తర్వాత రాష్ట్రానికి ఎలక్ట్రానిక్ రంగంలోనూ భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ రంగంలో రూ.38వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రాగా, వాటి ద్వారా 31వేల ప్రత్యక్ష ఉద్యోగాలు రావడం చెప్పుకోదగిన మరో ఘనత. పదహారేళ్ల హైదరాబాద్ ఐటీ రంగ ప్రస్థానంలో మూడు లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉంటే.. అదే గడిచిన తొమ్మిదేళ్లలో ఆ సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. ఐటీ రంగ ఎగుమతులు వేలల్లో ఉంటే ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల అసాధ్య లక్ష్యాన్ని సుసాధ్యం చేసింది. తొమ్మిదేళ్ల కాలంలో ఐటీ రంగంలో కొత్తగా 5,82,319 ఉద్యోగాలు లభించాయి. తెలంగాణ ఏర్పడ్డనాటికి ఐటీ రంగం భవిష్యత్తుపై నెలకొన్న సంశయాలను ఈ గణాంకాలు పటాపంచలు చేయడమే కాదు భవిష్యత్తుపై కొండంత భరోసాను నింపుతున్నాయి. ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేల మీద నెమ్మదిగా ఎదుగుతున్న ఐటీ రంగాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది. ఐటీ రంగ పెట్టుబడులకు తెలంగాణను స్వర్గదామంలా మార్చి.. స్టార్టప్‌లకు హైదరాబాద్‌ను రాజధానిగా చేసింది.
హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నది. ఇందులో రాష్ట్రంలోని టైర్ – 2, టైర్ -3 నగరాల్లోనూ ఐటీ రంగాన్ని విస్తరించి స్థానికంగానే ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా ప్రణాళికలను అమలు చేస్తున్నది. దీంతో హైదరాబాద్ దాటి ఐటీ, ఐటీయేతర రంగాలు విస్తరిస్తున్నాయి. అదేవిధంగా ఆర్థికాభివృద్ధితోపాటు గ్రామ స్థాయి వరకు ఐటీ ఫలాలను అందించడమే లక్ష్యంగా సేవలను విస్తరించింది. వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సిద్దిపేట, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లు, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ఐదు నగరాల్లో టవర్లు అందుబాటులోకి రావడంతోపాటు మరిన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. 5శాతం ఐటీ ఎగుమతులను ఆయా నగరాలకు విస్తరించేలా 25వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సెకండ్ ఐసీటీ పాలసీని తీసుకురానున్నది. వీటితోపాటు ఇన్ హౌజ్ టీ హబ్, టాస్క్, వీ హబ్ రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండలో ఐటీ, ఐటీఈఎస్ రంగాల విస్తరణ కోసం పలు అంతర్జాతీయ సంస్థలతో ఐటీ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఉత్సాహం చూపుతున్న యువతకు దిశానిర్ధేశం చేసి స్టార్టప్ రంగాల్లో దూసుకుపోయేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీనికోసం టీ ఏంజెల్, కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలను చేపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో స్టార్టప్‌లకు దిక్చూచిగా మారిన టీహబ్‌కు ఎన్నో అవార్డులు, మరెన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నది. ఇందులో బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా-2022, నేషనల్ టెక్నాలజీ అవార్డుతోపాటు, బెల్జియం, అమెరికా, స్వీడన్, యూకే వంటి ఎన్నో దేశాల ప్రతినిధుల ప్రశంసలను అందుకుని ఇన్నోవేషన్ రంగానికి చిరునామాగా మారింది. దీంతో స్టార్టప్ రంగంలో ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మహిళా సాధికారిత, ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ షిప్‌ను పెంచడమే లక్ష్యంగా 2017లో తీసుకువచ్చిన వీ హబ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనతి కాలంలోనే 21 స్టార్టప్ కార్యక్రమాలు, 5288 మహిళా ఆంత్రప్రెన్యూర్లతో 2823 ఉద్యోగాలను కల్పించే స్థాయికి వీ హబ్ ఎదిగింది. ప్రీ ఇంక్యుబేషన్, ఓపెన్ హౌజ్, గర్ల్స్ ఇన్ స్టెమ్, వీ ఆల్ఫా, గిజ్, ట్రైకార్, లాంచ్ ప్యాడ్, ప్రాజెక్ట్ ఉజ్గార్, పీడబ్ల్యూడీ ఉమెన్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ నారీ శక్తికి సహకరిస్తున్నది.
వరల్డ్ క్లాస్ ఫ్రొటో టైపింగ్ ఫెసిలిటీ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. టీ వర్క్స్ పేరిట ఆలోచనలకు నమూనా రూపం తీసుకువచ్చేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా ఎన్నో మైలురాళ్లను తెలంగాణ ప్రభుత్వం అధిగమించింది. ఇప్పటివరకు 300కు పైగా స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు టీ వర్క్స్ సేవలను వినియోగించుకోగా, 1000కి పైగా విడి భాగాల నమూనాలను ఆవిష్కరించింది. దీంతోపాటు 30 ఉత్పత్తులను ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అందించి ఫాక్స్‌కాన్, క్వాల్కామ్, వసంత టూల్స్, వంటి కంపెనీలతో కీలక ఒప్పందాలను చేసుకున్నది. వచ్చే ఏడాది కాలంలో రూ.100 కోట్ల విలువ కలిగిన విడిభాగాలను అందించడమే లక్ష్యంగా దూసుకుపోతుంది. అంతరిక్షయానంలో తొలి స్టార్టప్‌గా స్కై రూట్ ఇక్కడి నుంచి మొదలు కాగా ఎయిర్బోర్నక్ష మెడికల్ ర్యాపిడ్ ట్రాన్స్‌ఫోర్టు, పరిశోధనలకు అవసరమైన 3డీ ప్రింటెండ్ నమూనాలు, మెడికల్ డ్రోన్ పేలోడ్, మారుతి డ్రోన్స్, చార్ట్ టెక్నో, మెకానికల్ వెంటిలేటర్ వంటి ఫ్రొటోటైప్ ఉత్పత్తులను టీ వర్క్స్ అందించింది.
2016లో తీసుకువచ్చిన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్స్ పాలసీ పెట్టుబడులకు గేట్ వేగా మారింది. దీని ద్వారా ఇప్పటివరకు రూ. 50వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. గతేడాదిలోనే ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో ఏకంగా రూ.38వేల కోట్ల పెట్టుబడులు 32వేల మందికి ఉపాధినిచ్చేలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఈవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ ఈ మోటార్ షోను దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతిని దక్కించుకోవడం మరో విశేషం.
2015లో టీ హబ్ అందుబాటులోకి రాగా, ఏడేళ్లలో మరో దశకు చేరుకుని టీ హబ్ 2.0ను కూడా ఆవిష్కరించింది. స్టార్టప్ రంగానికి బూస్టప్నిస్తూ రూ.8.5 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకున్నది. దీంతోపాటు ఎంతో మందికి ఉపాధినిస్తూ, మరెన్నో స్టార్టప్ కంపెనీలకు ఆవాసం కల్పిస్తూ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌కు ఊతమిస్తున్నది. అదేవిధంగా స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌ను ప్రారంభించి విద్యార్థి దశలోనే ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు తోడ్పడుతున్నది. గ్రామీణ స్థాయిలో యువ పారిశ్రామికవేత్తలు, ఇన్నోవేటర్లను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపడుతున్నది. ఇంటింటా ఇన్నోవేటర్, ఇన్నోవేషన్ టూ ఆంత్రప్రెన్యూర్ షిప్, సోషల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమిట్, గవర్నమెంట్ సెన్సిటైజేషన్ వర్క్‌షాప్, సోషల్ ఆంత్రప్రెన్యూర్ షిప్ సమిట్తో కృషి చేస్తున్నది. మల్టీమీడియాలో విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకునేలా ఇమేజ్ పాలసీని తీసుకువచ్చిన ప్రభుత్వం దేశంలోనే తొలి మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పాలసీని రూపొందించింది. దీని ద్వారా దేశంలో హైదరాబాద్ నగరాన్ని యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్‌లో హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఎస్టీపీఐతో కలిసి కృషి చేస్తున్నది.
2016లో 400 స్టార్టప్‌లతో ఉన్న టీ హబ్ ప్రస్తుతం ప్రస్తుతం 2500 స్టార్టప్‌లకు విస్తరించింది. స్టార్టప్‌లకు అండగా నిలుస్తూ వినూత్న కార్యక్రమాలతో ఊతమిస్తున్నది. సుస్థిరమైన స్టార్టప్‌లను నెలకొల్పేందుకు ల్యాబ్ 32 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు అవసరమైన సేవలను ఈ కార్యక్రమం ద్వారా అందించనుండగా 800 దరఖాస్తులు వస్తే 14 స్టార్టప్‌లను ఎంపిక చేసింది. బిగ్ లీప్ ప్రొగ్రాం, రుబ్రిక్స్ కార్యక్రమాలతో స్టార్టప్‌లకు అవసరమైన ఫండింగ్, మెటరింగ్, ప్రొడక్ట్ మార్కెటింగ్‌కు అవసరమైన సేవలను అందించి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
ఈ క్రమంలో ఇటీవల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హై ఫాక్స్ కాన్’ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా Hon Hai Fox Conn సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా Hon Hai Fox Conn సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది. దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం కాగా.. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించడం మరో గర్వకారణం.
ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు ఇప్పటికే తెలంగాణ గడ్డపై తమ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అనేక ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాదులో ఏర్పాటు చేసుకున్నాయి. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్, ఇంటెల్, డీబీఎస్, పెప్సీకో, క్వాల్ కామ్.. వంటి ఎన్నో సంస్థలకు హైదరాబాద్ ఫేవరేట్ అడ్డాగా మారింది. సేల్స్ ఫోర్స్, ఇంటెల్, మైక్క్రాన్, ఎన్విడియా వంటి అనేక గ్లోబల్ మేజర్లకు రాష్ట్రం నిలయంగా మారింది. ఒప్పో, వన్ ప్లస్.. వంటి ప్రముఖ మొబైల్‌ఫోన్ తయారీదారులు తెలంగాణలో తమ ఆర్ ఆండ్ డీ కేంద్రాలను స్థాపించాయి. ప్రపంచంలోని అతి పెద్ద బహుళజాతి సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయంటే తెలంగాణ ప్రభుత్వం ఐటీ యజ్ఞం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
సాంకేతిక రంగంలో పెట్టుబడుల కోసం పోటీ కేవలం భారతదేశ రాష్ట్రాల మధ్య మాత్రమే ఉండదని, తెలంగాణ ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలతో, మహా నగరాలతో పోటీ పడవలసి ఉంటుందన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్దిష్టమైన అవగాహనే ఐటీ శాఖ గమనానికి దిక్సూచి. ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కరణలు తెలంగాణ నుంచే జరిగేలా కృషి జరుగుతోంది. అందులో భాగంగా టీ-హబ్, వి హబ్ టాస్క్, టీ-వర్క్స్ వంటి ఎన్నో ఎన్నెన్నో సంస్థల ఏర్పాటు. నవ కల్పనల్లో సూచీలను మించి రాష్ట్రం దూసుకుపోతున్నది. దేశానికి ఆవిష్కరణల దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం సగర్వంగా నిలబడింది.
”ఆలోచనలతో రండి – ఆవిష్కరణలతో వెళ్ళండి” అన్న నినాదంతో ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన టీ-హబ్ కేవలం ఇంక్యుబేటర్‌గా మాత్రమే కాకుండా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఎనేబ్లర్‌గా మారింది. నీతి ఆయోగ్ ప్రకటించిన ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో పెర్ఫార్మెన్స్ సూచికలో ముందు వరుసలో నిలుస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. స్టార్టప్‌ల కోసం ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ కింద అనేక అంకుర సంస్థలకు ప్రొత్సాహకాలు అందించింది. ఇక దేశంలోనే తొలిసారిగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం వి-హబ్ ఫౌండేషన్ ను ప్రభుత్వం ప్రారంభించింది.
మహా నగర సిగలో మరో డిజిటల్ మణిహారం రూపుదిద్దుకోబోతోంది. రాయదుర్గంలో అధునాతన ఇమేజ్ టవర్స్ నెలకొల్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో ప్రభుత్వం గేట్‌వే ఐటీ పార్క్ పేరుతో ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల్లో ఐటీ టవర్స్-ఇంక్యూబేషన్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సిద్దిపేట, నల్లగొండ పట్టణాల్లో ఐటీ ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటుకై పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదిలాబాద్ ఐటీ టవర్‌కు కూడా అనుమతులు జారీ అయ్యాయి. వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
నిరంతర శ్రమ.. అనుక్షణం పర్యవేక్షణ.. అంతకుమించి లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం.. వెరసి.. రాష్ట్ర ఐటీ రంగం అనూహ్య వేగంగా దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నాయకత్వంలో, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమర్ధ పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రం నేడు మొత్తం దేశానికే ఐటీ హబ్ గా, ప్రపంచ స్థాయి సంస్థల గమ్యస్థానంగా, ఆవిష్కరణలకు దిక్సూచిగా మారుతున్నది. డిజిటల్ తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా సాగుతున్నది.
– స్వామి ముద్దం
సీనియర్ జర్నలిస్టు,
9949839699
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews