హైదరాబాద్: బీసీలకు 60 శాతం MLA స్థానాలు కేటాయించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటనను చూసి ప్రధాన పార్టీలన్నీ బుద్ధి తెచ్చుకోవాలని ప్రజా పరిరక్షణ రాజకీయ కూటమి ఆధ్వర్యంలో కూటమి రాష్ట్ర అధ్యక్షులు, ‘మన టీఆర్ఎస్’ పార్టీ జాతీయ అధినేత ఏసీపీ అన్నారు. నారాయణగూడ తాజ్ మహల్ హోటల్లో ప్రజా పరిరక్షణ రాజకీయ కూటమి ఆధ్వర్యంలో కూటమి నాయకులు పాల్గొని జగిత్యాల జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీసీలకు 60% MLA స్థానాలు కేటాయించాలని మాట్లాడడం అభినందనీయమని అన్నారు.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ వర్గం వాళ్లు (రెడ్డి) 5 శాతమే ఉంటే విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించారని చెప్పారు. బీసీలు మాత్రం 60 శాతం ఉంటే రిజర్వేషన్ కేవలం 25 శాతం మాత్రమే కల్పించారని చెప్పారు. 20 మంది మంత్రుల్లో బీసీలు ముగ్గురే ఉన్నారని, మిగతా వాళ్లంతా రెడ్డి, వెలమ దొరలే ఉన్నారని వ్యాఖ్యానించారు. బీసీలు కేవలం ఎమ్మెల్యే సీట్ల కోసమే కాకుండా.. భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. జీవన్ రెడ్డి ప్రకటనపై ప్రజా పరిరక్షణ రాజకీయ కూటమి నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడికి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పించి బీసీ మానవతావాది అని నిరూపించుకోవాలని, ప్రజా పరిరక్షణ రాజకీయ కూటమి ద్వారా మన టీఆర్ఎస్ పార్టీ జాతీయ అధినేత ఏసీపీ, బహుజన రాజ్యం పులి అంబేద్కర్ జాతీయ నాయకులు రమావత్ లాల్ నాయక్, ఆధార్ పార్టీ నాయకులు శేషగిరి గౌడ్, జన శంఖారావం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, బీసీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు సుశీల్ కుమార్ యాదవ్ పాల్గొన్ని ప్రసంగించారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
https://www.youtube.com/watch?v=-6PTLh_wB_I
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/