◉ గమ్యస్థాన దేశాల చట్టాలపై అవగాహన కల్పించాలి
◉ గల్ఫ్ జైళ్లలో 4,630 మంది భారతీయులు
(గల్ఫ్‌లో జైలు శిక్షలపై విశ్లేషణ)
కఠినమైన చట్టాలు ఉండే గల్ఫ్ దేశాలలో తెలంగాణ యువత తెలిసీ తెలియక, అవగాహన లేకుండా డ్రగ్స్ ఉచ్చులో పడి జీవిత ఖైదు అనుభవిస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒళ్ళు నొప్పి మాత్రలు, గసగసాలు, మత్తు పదార్థాల సరఫరా రాకెట్ లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడు జనవరిలో మత్తు పదార్థాలు కేసులో అనుమానితుడిగా యూఏఈ దేశంలోని దుబాయిలో అరెస్టయ్యాడు. ప్రస్తుతం అబుదాబి లోని సుహాన్ సెంట్రల్ జైల్లో మగ్గుతూ విచారణను ఎదుర్కొంటున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన ఒక యువ ఇంజనీర్ జాతీయ భద్రతా కేసులో నాలుగేళ్ల క్రితం అరెస్టయి అబుదాబి జైల్లో మగ్గుతున్నాడు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి, జగిత్యాల జిల్లా కన్నాపూర్ కు చెందిన ఇద్దరు కార్మికులు ఒళ్ళు నొప్పి మాత్రల కేసులలో, కామారెడ్డి జిల్లా కరడ్ పల్లి కి చెందిన ఒక కార్మికుడు గంజాయి కేసులో వేరు వేరుగా దుబాయి జైల్లో గత పదేళ్లుగా మగ్గుతున్నారు. ఈ ముగ్గురి కుటుంబ సభ్యులు 2016 లో ఢిల్లీ వెళ్లి అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ 2023 ఆగస్టు 11న లోక్ సభకు ఇచ్చిన సమాచారం ప్రకారం 4,630 మంది ప్రవాస భారతీయులు ఆరు అరబ్ గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో రకరకాల కేసులలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక శిక్షలు పడిన ఖైదీలు, విచారణ ఖైదీలు కూడా ఉన్నారు. యూఏఈ లో (1,611), సౌదీ అరేబియా లో (1,461), ఖతార్ లో (696), కువైట్ లో (446), బహరేన్ లో (277), ఓమాన్ లో (139) మంది జైళ్లలో ఉన్నారు.
విదేశాల్లో ఖైదు చేయబడిన భారతీయులకు కాన్సులర్ అసిస్టెన్స్ (దౌత్య సహాయం), లీగల్ ఎయిడ్ (న్యాయ సహాయం) అందించాలని కోరుట్ల కు చెందిన గల్ఫ్ జెఏసి నాయకుడు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు కోరారు. కార్మికులకు గల్ఫ్ దేశాల చట్టాలపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలి. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ కు అధికం నిధులను కేటాయించి పేద కార్మికులను ఆదుకోవాలి. ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఎంబసీలలో ప్యానల్ లాయర్ల సంఖ్యను పెంచాలని శ్రీనివాస రావు కోరారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP