నటీనటులు: భరత్, విషికా లక్ష్మణ్‌, కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

సాంకేతిక బృందం:
బ్యానర్: ప్రభాత్ క్రియేషన్స్
నిర్మాత: ప్రదీప్ కుమార్. ఎం
డైరెక్టర్: గంగాధర. టి
కెమెరామెన్: సతీష్‌ మాసం
సంగీతం: పీఆర్ (పెద్దపల్లి రోహిత్)
మాటలు: వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల
ఎడిటర్:  జేపీ
డీఐ: పీవీబీ భూషణ్
పీఆర్వో: సాయి సతీష్

ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఓ బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ ఉంటే ప్రేక్ష‌కులు ఖ‌చ్చితంగా హిట్ చేస్తారు. అలాంటి గ్రామీణ నేప‌థ్య ప్రేమ‌క‌థ‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం ద్వారా గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 6న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో చూద్దాం.

కథ: రామాపురం గ్రామంలో జ‌రిగే క‌థ ఇది. ఆ ఊరిలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు హడలిపోతుంటారు. దాంతో ఆ ఊరి సర్పంచ్ పెద్దారెడ్డి (తోటపల్లి మధు) తో పాటు ఊరి పెద్దలైన సుధాకర్ రెడ్డి (రవి వర్మ) రామచంద్రా రావు(కాశీ విశ్వనాధ్)లు గ్రామ ప్రజల ఎదుట పంచాయితీ పెడతారు. ఈ ఊరిలో జరిగే దొంగతనాలు అరికట్టాలి అంటే మన ఊరికి ఒక పోలీసు ఉండాలి. కాబట్టి ఎస్‌ఐ కావాలని ప్రయత్నం చేస్తున్న అభి(భరత్)ని ఈ ఊరికి కాపలా పెట్టాల‌ని అందుకు ఊరి నిధుల నుంచి జీతం కూడా ఇస్తామని చెప్పడంతో అభి ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో ఊరి పెద్ద రామాంచంద్ర రావు ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఎంక్వ్వైరీ కి వెళ్లిన అభికి సిటీ నుండి వచ్చిన రామాచంద్ర రావు కూతురు యమున (విషికా లక్ష్మణ్‌) ను చూసిన మొదటి చూపులో ప్రేమలో పడతాడు.ఆ తరువాత అభి చేసిన ఒక మంచి పనితో అభిని ఇష్టపడుతుంది. దాంతో వారిద్దరూ పెళ్లిచేసుకోవాలి అనుకుంటారు.

సీన్ క‌ట్ చేస్తే.. పుంగనూరు ఎమ్మెల్యే నందకిశోర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఊరి ప్రజలు ఓటు వేసి మళ్ళీ త‌న‌నే గెలిపించాలని కోరుతూ ఊరు కోసం మూడుకోట్లు ఇస్తాడు. అవి తీసుకొని ఊరికి వచ్చిన తరువాత ఆ మూడు కోట్లు మిస్ అవుతాయి. ఆ నేరం అభిపై పడడం వలన పోలీసులు అభిని అరెస్ట్ చేస్తారు. దీంతో యమున అభిని దూరం పెడుతుంది. అలాగే తన తండ్రి తెచ్చిన సంబంధం ఒప్పుకొని పెళ్ళికి సిద్దపడుతుంది. పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన అభికి యమునకు నిక్షితార్థం జరుగుతుందని తెలుసుకుంటాడు. దాంతో యమున ఇంటికి వచ్చి తన తండ్రితో గొడవపడతాడు. ఈ గొడవలో యమున తండ్రి గాయపడతాడు. ఆది చూసిన యమున అభిని అసహ్యయించుకొని పోలీసులకు పట్టిస్తుంది. అయితే అనూహ్యంగా ఊరి సర్పంచ్ పెద్దారెడ్డి,సుధాకర్ రెడ్డి లు హత్యకు గుర‌వుతారు. ఈ నేరం కూడా అభిపై పడుతుంది. ఇంతకు ఈ జంట హత్యలను ఎవరు చేశారు? ఈ నేరానికి అభికు ఉన్న సంబంధం ఏంటి? అస‌లు ఈ కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాడా? తను ప్రేమించిన యమున సంగ‌తి ఏంటీ? మూడు కోట్లు రికవరీ చేస్తాడా లేదా ? చివరకు ఎస్ఐ కావాలనే డ్రీమ్ ను అభి నెరవేర్చుకున్నాడా ? అనేది తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరుః
అభి పాత్ర‌లో భర‌త్ చాలా బాగా న‌టించాడు. ఎస్సై కావాలని కలలుకనే పాత్రలో జీవించాడు. అన్ని షేడ్స్ లో చాలా చక్కగా నటించి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. నటుడుగా తనకిది ఫ‌స్ట్ మూవీ అయినా సీనియర్ యాక్టర్ లా కథను తన బుజాలపై వేసుకొని చాలా చక్కగా నటించాడు. యమున పాత్రలో హీరోయిన్ గా నటించిన విషికా లక్ష్మణ్‌ తనకిచ్చిన పాత్రలో ఒదిగి పోయింది. తన నటనతో అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేసి మరో మెట్టు పైకి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. తెరపై వీరిద్దరి జోడీ చాలా క్యూట్ గా ఉంది.హీరోకు ఫ్రెండ్స్ గా నటించిన సత్తి (తేజ ), శ్రీను పాత్రలో దర్శకుడు గంగాధ‌ర్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌తో కామెడీ ట్రాక్‌తో మెప్పించారనే చెప్పాలి.ఊరి జనాలకు ఏ కష్టం వచ్చినా ముందుండే ఉరి పెద్దకులుగా పెద్దారెడ్డి (తోటపల్లి మధు), సుధాకర్ రెడ్డి(రవి వర్మ ), రామచంద్ర ( కాశీ విశ్వనాధ్ ) చాలా చక్కగా నటించాడు.పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో నటించిన యస్. ఐ.ప్రదీప్ (విజయ్ ) నటన న్యాచురల్ గా ఉంది. అభికి తండ్రి గా ప్రేమ్ సాగర్, బ్యాంక్ మేనేజర్ గా సమీర్ లు, యమున ఫ్రెండ్ గా స్వాతి (లత ) చక్కటి పెర్ఫార్మన్స్ చేశాడు.ఇంకా ఇందులో నటించిన వారంతా తమ పరిదిమేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
డైరెక్టర్ గంగాధర్ కిది తొలి సినిమా అయినప్పటికీ సిటీలో ఉండే పబ్ కల్చర్, పల్లెటూర్లో ఉండే స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందనే కథను సెలెక్ట్ చేసుకుని ఎమోషనల్‌గా బాండింగ్‌ ఉన్న సబ్జెక్‌ ను ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ లాంటి ఆసక్తికర సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకులు సస్పెన్స్ కు గురయ్యేలా కొనసాగిస్తూ చక్కటి కథ, స్క్రీన్ ప్లే తో తీసిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో ఎటువంటి డబుల్ మీనింగ్ జోకులు గాని లేకుండా సహజంగా ఆకట్టుకునే సన్నివేశాలతో నీట్ అండ్ క్లీన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందించడంలో దర్శకుడు గంగాదర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.పీఆర్ (పెద్దపల్లి రోహిత్) అద్భుతమైన సంగీతం అందించారు. సునీత పాడిన తండ్రి కూతుళ్లు మధ్య వచ్చే ఎమోషనల్ సొంగ్ తలచే తలచే కొద్ది గుర్తిస్తున్నావ్ నాన్న పాట మరియు అనురాగ్ కులకర్ణి పాడిన లవ్ సాంగ్ ‘ఏమో ఏమో ఏమో ఏమో ఏమౌతుందో నాలో ఏమో’ వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.సతీష్‌ మాసం కెమెరా పనితనం మెచ్చుకోవచ్చు. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బందించి తన కెమెరా పనితనాన్ని చాటారు. జేపీ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

మొత్త‌మ్మీద అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని చెప్పవచ్చు. ప్ర‌తి ఒక్క‌రిని ఈ సినిమా ఆక‌ట్టుకుంటుంద‌ని నిస్స‌దేహంగా చెప్పొచ్చు.

రేటింగ్ 3/5

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin