హైదరాబాద్:
ఎన్నిక‌ల్లో అవినీతిని ఎత్తిచూపుతూ తెర‌కెక్క‌నున్న ‘జై భారత్’ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాష్ అంబేద్కర్ సినిమాకు సంబంధించిన‌ సందేశాన్ని తెలిపారు. డబ్బు, మద్యం, మరే ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా చిత్తశుద్ధితో సేవలందించేందుకు తాము విశ్వసించే అభ్యర్థులకే ప్రత్యేకంగా ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఓట‌ర్లంద‌రికి అవగాహన పెంచడానికి ఈ మూవీ పోస్టర్ ఆవిష్క‌రిస్తున్న‌ట్టు ప్రకాష్ అంబేద్కర్ తెలిపారు.

ఈ చిత్రాన్ని దర్శకుడు స్వామి ముద్దం తెర‌కెక్కించ‌బోతున్నారు. నక్షత్రం ప్రొడక్షన్ వారు నిర్మించనున్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యాన్ని స్వీకరించి రాజకీయ సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకున్న నిరుపేద కుటుంబాల కథనాన్ని ‘జై భారత్‌’లో చూపించబోతున్న‌ట్టు స్వామి ముద్దం తెలిపారు. మెరుగైన భారతదేశం కోసం మంచి మెసెజ్ ఉంటుంద‌ని, క‌థ‌నం ప్ర‌తి ఒక్క ఓట‌రును క‌దిలిస్తుంద‌ని తెలిపారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి, ఉపాధ్య‌క్షుడు బుచ్చ‌న్న, ప‌బ్బు శ్రీ‌నివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin