హైదరాబాద్ (మీడియాబాస్ నెట్వర్క్): ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల కడుపు నింపేందుకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తోంది రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సంస్థ. లక్డీకపూల్‌లోని నీలోఫర్, ఏంఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగార్జునసాగర్ నియోజక వర్గంకు చెందిన నాయకులు కుందూరు జైవీర్ రెడ్డి జన్మదిన సందర్బంగా ఎండ్. జానీ పాషా, రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీఆఎస్ నాయకులు వజీర్ ప్రకాష్ గౌడ్, డాక్టర్ పంతుల వదత్య, 100 ఎక్స్ వాసు ఏంబిఎ, రాకేష్ దత్త. రాజ్ కుమార్ పటేల్, సుమంత్ నేత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రముఖులు వాజీర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని దానల్లో కెల్లా అన్నదానం గొప్పదని చెప్పారు. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సంస్థ ఇలా అన్నదానం కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. అన్నదానం కార్యక్రమం ఏదో ఒక ఆదివారం కాకుండా ప్రతి ఆదివారం ఒక హైదరాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక యజ్ఞం లా చేయడం గొప్ప విషయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్, కో-ఆర్డినేటర్ ప్రకాష్ యాదవ్, శివ నేత, గుండుమల్ల శివ చైతన్య, శివ నేత, ప్రవీణ్ కుమార్ సభ్యులు బి నవీన్, డి ప్రశాంత్, నరేందర్ వర్మ, మని కుమార్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.