New Jersey (MediaBoss Network): విద్యార్థులకు అవ‌స‌ర‌మ‌య్యే కోర్సుల‌ను ఆధునిక ప‌ద్దతుల్లో అందించ‌డానికి క్యూఐక్యూ (QIQ) లెర్నింగ్ ఆకాడ‌మీ ప్రారంభ‌మైంది. న్యూజెర్సీలోని సౌత్ ప్లేయిన్‌ఫీల్డ్‌లో క్యూఐక్యూ లెర్నింగ్ ఆకాడ‌మీని మేయర్ అనిష్.. కౌన్సిల్ మాన్ డేరిక్, కౌన్సిల్ మాన్ జోసెఫ్ సీ ఓలక్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మేయర్ అనిష్ నిర్వ‌హ‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. విద్యార్థులకు నాణ్య‌మైన కోర్సుల‌ను అందిస్తూ, పేదలకు ఉచితంగా కోర్సులను భోదిస్తున్నందున ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం గౌరవప్రదంగా అందించే బోరగ్ అనే బ్యాడ్జిని  QIQ లెర్నింగ్ ఆకాడ‌మీ ఫౌండర్ శ్రీకాంత్ కు మేయర్ అనిష్ అందించారు. అలాగే సహకారం అందించిన విలాస్ జంబులకు కూడా బ్యాడ్జిని అందించారు. సహకారం అందించిన వారిలో సందీప్ ఉన్నారు.

తెలుగు ఎన్నారైల‌కు చెందిన క్యూఐక్యూ లెర్నింగ్ ఆకాడ‌మీ.. మిగతా ఆకాడ‌మీల కంటే అతి త‌క్కువ ఫీజుల‌కే నాణ్యమైన, ఆధునిక పద్దతుల్లో కోర్సులు బోధిస్తారు. అంతేకాదు పేద‌, మ‌ద్య‌త‌ర‌గ‌తి వారికి కోర్సులు ఉచితంగా అందించ‌నున్నారు.

క్యూఐక్యూ లెర్నింగ్ ఆకాడ‌మీ ప్రారంభం సంద‌ర్భంగా విద్యార్థుల‌కు ప్ర‌త్యేక డిస్కౌంట్ ఆఫ‌ర్ ఇస్తున్న‌ట్టు నిర్వ‌హ‌కులు తెలిపారు. విద్యార్థులకు ఆలోచనరేకెత్తించే విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని పెంపొందిస్తే విజ‌యం సాధిస్తారని, అందుక‌నుగుణంగా తాము కోర్సుల‌ను రూపొందించిన‌ట్టు తెలిపారు. తాము అందిస్తున్న కోర్సుల వివరాల కోసం www.qiqlearningacademy.com వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

క్యూఐక్యూ లెర్నింగ్ ఆకాడ‌మీ నిర్వాహకులకు వేదపండితులు, సాయిదత్త పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ రఘు శంకరమంచి ఆశీర్వాచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో పలు తెలుగు ఎన్నారై సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *