మహి వీ రాఘవ్ తీసిన ‘యాత్ర’ చిత్రం సంచలనం సృష్టించింది. వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర ఆధారంగా యాత్రను తీసిన మహి.. వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర నేపథ్యాన్ని తీసుకుని ‘యాత్ర 2’ తీశాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.
కథ:
2009లో వైఎస్సార్ (మమ్ముట్టి) తన కొడుకు జగన్ (జీవా)ను ప్రజలకు పరిచయం చేయడంతో, రెండోసారి విజయం సాధించడంతో ‘యాత్ర 2’ మొదలౌతుంది. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ (సినిమాలో ప్రోగ్రెస్ పార్టీ అని చూపిస్తారు) జగన్‌ని కాదని రోశయ్యని ముఖ్యమంత్రిని చేస్తుంది. జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యేలంతా సంతకాలు సేకరించినా కూడా అధిష్ఠానం పట్టించుకోదు. వైఎస్ మరణవార్తతో దాదాపు 660 మంది చనిపోవడంతో.. వాళ్లని పరామర్శించడం కోసం జగన్ ఓదార్పు యాత్ర చేపడతారు. ఆ యాత్రను ఆపేందుకు అధిష్టానం ప్రయత్నిస్తుంది. కానీ జగన్.. వారికి ఎదురొడ్డి నిలబడతారు. ఇచ్చిన మాటకి కట్టుబడి మొండిగా ఓదార్పు యాత్రను చేపడతాడు. దీంతో ఆగ్రహం చెందిన కాంగ్రెస్ పార్టీ జగన్‌పై చర్యలకు సిద్ధం కావడం.. ఆ పార్టీకి రాజీనామా చేయడం, కొత్తగా వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటు చేయడం వంటివి జరుగుతాయి. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని ఎలా ఢీ కొట్టాడు?. తెలుగుదేశం పార్టీ (సినిమాలో తెలుగునాడు)ని అధికారానికి దూరం చేసి.. 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఎలా సాధించగలిగారు? అనేది థియేటర్లో చూడాల్సిందే.
నటీనటులు:
యాత్ర 2 అంతా కూడా జగన్ (జీవా) పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అడుగడుగునా జగన్ హీరోయిజం, ఎవ్వరికీ తలవంచని గుణం, ఇచ్చిన మాటకు కట్టుబడే గుణాన్ని చూపించారు. జగన్‌గా జీవా అద్భుతంగా నటించేశాడు. జగన్‌లా నడవడం, హావభావాలు పలికించడం, ఆ పాత్రలోని హుందాతనాన్ని జీవా చక్కగా పలికించాడు. జీవా తన నటనతో ప్రేక్షకుల్ని కదిలించాడు. ఇక మమ్ముట్టి కనిపించేది కొద్ది సేపే అయినా అద్భుతంగా అనిపిస్తుంది. వైఎస్సార్ పాత్రలోని హుందాతనాన్ని, గొప్పదనం ఉట్టిపడేలా నటించేశాడు మమ్ముట్టి. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్ ఇలా ఎవరి పాత్రలకు వారు తగిన న్యాయం చేశారు.
విశ్లేషణ:
వైఎస్ జగన్ లాంటి డైనమిక్ లీడర్, ఆయన చేసిన పాదయాత్రను కాన్సెప్ట్‌గా ఎంచుకుని సినిమా తీయాలనే థాట్‌కే మహి వీ రాఘవకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇలాంటి సినిమాలు తీయడం అంటే కత్తి మీద సాము అన్నట్టుగా ఉంటుంది. ఒకరిని హీరోని చేయడం కోసం ఇంకొకర్ని విలన్ చేయాలనే సూత్రాన్ని మహి వీ రాఘవ ఎంచుకోలేదు. ఒకరి మంచిని చెప్పాలంటే.. ఇంకొకరి చెడు చెప్పాల్సిన పని లేదన్న ఫార్మూలాతోనే యాత్ర 2ను మలిచాడు.
ఓ తండ్రి.. తండ్రికి ఇచ్చిన మాట కోసం నిలబడే కొడుకు.. అనే పాయింట్‌తో సినిమాను ఫుల్ ఎమోషనల్‌గా చూపించాడు. ఈ చిత్రంలో ఎక్కడా కూడా ఎవ్వరినీ తక్కువ చేసి చూపించకపోవడం, ఎవ్వరినీ కించపర్చకపోవడం మహి వీ రాఘవలోని రైటింగ్, మేకింగ్, టేకింగ్, టాలెంట్‌కు, గొప్పదనంకు నిదర్శనం. కేవలం వైఎస్ జగన్ పాత్రను ఎంతలా ఎలివేట్ చేయగలడో, ఎంత బాగా చూపించగలడో అంత బాగా చూపించేశాడు.
తెలిసిన కథను రెండు గంటల సేపు థియేటర్లో కూర్చోబెట్టి చూపించేలా చేయడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు.కానీ మహి వీ రాఘవ ఆ సాహసం చేశాడు. తెలిసిన కథను ప్రేక్షకుడికి ఎంతో అందంగా, ఎంతో ఎమోషనల్‌గా టచ్ చేస్తూ చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. మహికి అండగా తన టెక్నికల్ టీం నిలిచింది. మాటలు ఈ చిత్రాన్ని నిలబెట్టేశాయి. ఒక్కో డైలాగ్ వింటుంటే..అది కలంలోంచి కాదు గుండెల్లోంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. విజువల్స్ సినిమాకు పెద్ద ఎస్సెట్. ఆర్ఆర్ సినిమాకు బ్యాక్ బోన్‌లా నిల్చింది. అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతం చేశాయి. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నత స్థాయిలో అనిపిస్తాయి.
వైఎస్ జగన్ అభిమానులను ఈ చిత్రం కట్టి పడేస్తుంది. సాధారణ సినీ ప్రేమికుడ్ని సైతం యాత్ర 2 ఇట్టే ఆకట్టుకుంటుంది. ఓ ఎమోషనల్ జర్నీలా యాత్ర 2 సాగుతుంది.
రేటింగ్: 3/5
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r