▪️ స్థానికులకు మాత్రమే మహబూబ్ నగర్ టికెట్‌లు ఇవ్వాలి
▪️ పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల‌కు మున్నూర్ రవి విజ్ఞ‌ప్తి

మహబూబ్‌నగర్: వ‌చ్చే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ను స్థానిక అభ్యర్థులకే కేటాయించాలని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని మహబూబ్‌న‌గర్ అభివృద్ధి ఫోరం చైర్మన్ మున్నూరు రవి అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఇప్పటివరకు స్థానికేతరులైన ఎంపీలు మహబూబ్‌న‌గర్ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఈ ప్రాంత సమస్యలను గాలికి వదిలేసి వాళ్లు ఢిల్లీకి పరిమితమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుడు పరిధిలో వందల స్కీములు ఉంటాయని వీటిని గ్రామీణ ప్రాంత యువతకు అందేలా చేస్తే గ్రామ స్వరాజ్యం స్థాపితం అవుతుందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ను స్థానికుల కేటాయించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు మహబూబ్‌న‌గర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల భవనంలో మహబూబ్‌నగర్ డెవలప్‌మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ డెవలప్ చైర్మన్ మున్నూరు రవి మాట్లాడుతూ… బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యులు స్థానికులు అయితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా కేవలం ఇద్దరంటే ఇద్దరు మాత్రమే ఈ ప్రాంతం నుంచి వచ్చిన వారు ఎంపీ అయ్యారని ఆయన గుర్తు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ స్థానికేతరులు అనే ఎంపీ అభ్యర్థులుగా ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు రెండే రెండు ఉన్నాయని ఒకటి డబ్బు మరొకటి మద్యం విచ్చలవిడిగా పంచె నేతలనే గుర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్థానికేతర్లైన వారు ఎంపీలుగా గెలిచి ఢిల్లీలో కూర్చోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కరువై పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్లిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికేతరులైన వారు ఇక్కడ ఎంపీలుగా గెలిచిన తర్వాతప్రజల ఇబ్బందులు తెలుసుకోవడానికి కనీసం ఒక క్యాంపు కార్యాలయం కూడా ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం వీడి స్థానికులైన అభ్యర్థులకే ఎంపీ టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానికులకు ఎంపీ టికెట్లు కేటాయిస్తే ఈ ప్రాంత ప్రజల అమితమైన ఆదరణతో వాళ్లు గెలవడమే కాకుండా గెలిచినవారు కూడా ఇక్కడి సమస్యలపై వారికి పూర్వ అవగాహన ఉన్నడంతో అభివృద్ధి జరుగుతుందని ఆయన గుర్తు చేశారు ఎంపీలుగా గెలిచిన వారికి లక్షలాది రూపాయల వేతనం కింద చెల్లించడంతోపాటుగా ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తున్నదని… ప్రజలకు సేవ చేయకుండా తప్పించుకు తిరిగే వారికి ఇలాంటి అంటూ ఆయన నిగ్గదీశారు. స్థానికులకు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఉద్యమాన్ని వ్యాపింపజేస్తామని.. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీ అధినేతలను కలిసి వినతిపత్రాలు ఇస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలోమున్నూరు రవి ఛైర్మైన్
సారంగి వినయ్ కుమార్ – గౌరవ అధ్యక్షులు
సాజిదా సికిందర్- సామాజిక ఉద్యమకారురాలు ,సీనియర్ జర్నలిస్ట్
పటేల్ వెంకటేష్ – ఎండిఎఫ్ ఉపాధ్యక్షులు
మొహమ్మద్ మాసిఉద్దీన్ – మాజీ కౌన్సిలర్,ఎండిఎఫ్ మైనర్టీ అధ్యక్షులు
ముసంగి వెంకటేష్ – ముదిరాజ్ సేవ సమితి అధ్యక్షులు
బలగం పూర్ణచందర్ గౌడ్ – వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ అధ్యక్షులు
మహమ్మద్ సమీర్ – దేవరకద్ర ఎండీఎఫ్ కన్వీనర్
ఓంకార్ – విద్యార్థి నాయకుడు
తదితరులు కులసంఘాల సభ్యులు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin