నటీనటులు
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహ‌మ‌ద్‌ ,మోహిత్ పేడాడ‌, నీల ప్రియ, కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు, విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు

సాంకేతిక వర్గం:
బ్యానర్ – సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు – ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం – పద్మారావు అబ్బిశెట్టి (పండు), మాటలు – వినయ్ కొట్టి, ఎడిటర్ – రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ – ఎం. ఎబెనెజర్ పాల్, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ స్వయంభు

కుటుంబంలో ఏర్ప‌డే భావోద్వేగాల‌ను, స‌వాళ్ల‌ను ఘ‌డంగా తెర‌కెక్కించిన చిత్రం సారంగదరియా. రాజా రవీంద్ర కీలక పాత్రలో, దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి తెర‌కెక్కించిన ఈ చిత్రం థియేట‌ర్‌ల‌లోకి వచ్చింది. శివచందు, యశస్విని, మొయిన్ మొహమద్, మోహిత్ పేడాడ, నీల ప్రియా కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

కథః
కృష్ణ కుమార్ (రాజా రవీంద్ర) ఓ కాలేజ్ లెక్చరర్. ఆయన తన భార్య లక్ష్మి (నీల ప్రియ) ముగ్గురు పిల్లలు అర్జున్ (మొయిన్ మొహమద్), సాయి (మోహిత్ పేడాడ), అనుపమ (యశస్వినీ)తో ఓ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. కావ్య అనే అమ్మాయితో లవ్ ఫెయిల్యూర్ వల్ల తాగుడుకు బానిస అవుతాడు అర్జున్. చిన్న కొడుకు సాయికి అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు. ఈ క్ర‌మంలో అతను ఫాతిమ (మధులత)ను ప్రేమిస్తుంటాడు. ఇక కృష్ణ‌కుమార్ కూతురు అనుప‌మ‌ అందాల పోటీల్లో పాల్గొని పేరు తెచ్చుకోవాలకుంటుంది. ఇద్దరు కొడుకులు చేసే బాధ్యతారహితమైన పనులతో తండ్రి కృష్ణ విసుగెత్తి పోతుంటాడు. అనుపమను రాజ్ (శివకుమార్) సిన్సియర్ గా లవ్ చేస్తాడు. ఆమె రాజ్ ప్రేమను అంగీకరించదు. ఈ క్రమంలో అనుపమ గురించి ఓ నిజం ఇరుగుపొరుగు వారికి తెలుస్తుంది. అవమానంతో అనుపమ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఇంతకీ అనుపమ జీవితంలో దాగిన ఆ నిజం ఏంటి? అనుపమ తన జీవిత లక్ష్యమైన అందాల పోటీలో కిరీటం గెల్చుకుందా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
సీనియ‌ర్ న‌టుడు రాజా రవీంద్ర ఈ సినిమాలో ఓ మధ్యతరగతి తండ్రిగా, లెక్చరర్ గా న‌టించాడు. సినిమాకు ఆయ‌న న‌ట‌న హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు. చాలా స‌హజంగా న‌టించాడు. సాయిగా మోహిత్ పేడాడ, అర్జున్ పాత్రలో మొయిన్ మొహమద్ త‌మ పాత్ర‌ల‌తో ఆకట్టుకున్నారు. అనుపమ పాత్రలో యశస్వినీ నటన సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా చెప్పుకోవచ్చు. ఆమె ఎమోషన్స్ ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటాయి. మిగ‌తా పాత్ర‌ధారులు త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

టెక్నిక‌ల్ టీమ్:
ప్రొడక్షన్ వ్యాల్యూస్, టెక్నికల్ టీమ్ ప్రతిభ మూవీలో కనిపించింది. సినిమాకు మ్యూజిక్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవ‌చ్చు. కెమెరా ప‌నిత‌నం బెట‌ర్‌గా ఉంది. ఎబెనెజర్ పాల్ కంపోజిషన్‌లో చిత్ర‌ పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే.., ‘ఈ జీవితమంటే..’ పాటలు బాగున్నాయి. వినయ్ కొట్టి రాసిన డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘బాగుంది.. బాగుంది..’ అనే పాట కూడా బాగుంది.

విశ్లేష‌ణ‌:
కులం, మతం, జెండర్ అనే బేధాలు ఇంకా సమాజం నుంచి పోవడం లేదు. ఈ మూడు సున్నిత‌మైన‌ సమస్యలను ఎంటర్‌టైనింగ్, ఎమోషన్ కలిపి ప్రేక్షకులకు నచ్చేలా తెర‌కెక్కించాడు దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి. ఆయన విజన్‌ను నమ్మి సినిమాను నిర్మించిన నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి అభిరుచిని అభినందించాల్సిందే. డైరెక్ట‌ర్ తాను అనుకున్న క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. కులం కారణంగా అర్జున్ తన ప్రేమకు దూరమవడం, మతం వల్ల సాయి.. ఫాతిమను దక్కించుకోవడం కోసం సంఘర్షణ పడటం, ట్రాన్స్ జెండర్ కావడం వల్ల అనుపమ సొసైటీ నుంచి ఎదుర్కొన్న అవమానాలు. తన ముగ్గురు పిల్లల పరిస్థితి చూసి తండ్రిగా కృష్ణ పడే వేదన ఇవన్నీ మనసుకు హత్తుకునేలా చిత్రిక‌రించాడు డైరెక్ట‌ర్. ముగ్గురు పిల్ల‌లు మూడు ర‌కాల స‌మ‌స్య‌ల‌తో జీవితంలో ఎదుర్కొన్న కోణాల‌ను హృద‌యాన్ని ట‌చ్ చేసే విధంగా చూపించారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్ కూడా భాగమేనని, వారిని చిన్న‌చూపు చూడ‌కూడ‌ద‌ని, వారికీ అన్ని హక్కులు ఉంటాయనే విషయాన్ని అనుపమ పాత్ర ద్వారా చెప్పిన తీరు బాగుంది. చివరగా అనుపమ తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో చూపించిన ఆత్మ‌విశ్వాసం, తండ్రి పాత్ర గురించి చెప్పే మాటలు హార్ట్ ట‌చింగ్‌గా ఉన్నాయి. స‌మాజంలోని మాన‌వ సంబంధాల‌ను గొప్ప‌గా ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. కుటుంబ స‌భ్యుల‌తో త‌ప్ప‌క చూడ‌వ‌చ్చు.

రేటింగ్ 3/5

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV


 

By admin