‘పెళ్లి చూపులు’ ఈ నగరానికి ఏమైంది మూవీస్ తో మ్యాజిక్ చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు ఆయన డైరెక్షన్ మాత్రమే కాకుండా నటిస్తూ, పలు సినిమాలను నిర్మిస్తున్నాడు.
తాజాగా తరుణ్ భాస్కర్-విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల కాంబోలో ఓ కొత్త సినిమా రాబోతుంది. ఈ ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్స్ నుంచి వస్తోన్న సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. అయితే, ఈ సినిమాలో ఓ జంటకు విడాకులు ఇప్పించడానికి నటీనటులు కావాలంటూ ఓ డివోర్స్ నోటీస్ రూపంలో క్యాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు. ఇడుపు కాయితం అంటూ పక్కా తెలంగాణ యాసలో డివోర్స్ నోటీస్ పై ఈ క్యాస్టింగ్ కాల్ ఉంది.
నోటీసులో ఏం ఉందంటే..”తేదీ 12-12-2024 బేస్తారం రోజున ఇల్లంతకుంట శ్రీసీతారామచంద్ర స్వామి గుడెనుక సమ్మక్క సారలమ్మ గద్దెలకాడ, మర్రిశెట్టు కింద జమ్మికుంట వాస్తవ్యులైన బూర సమ్మయ్య గౌడ్ బిడ్డ శ్రీలతకు పోత్కపల్లి గ్రామ వాస్తవ్యులైన గోడిశాల పోశాలు కొడుకు శ్రీనివాస్ గౌడ్ కు ఇడుపు కాయితం పంచాయితీ జరుగుతాంది. ఆ పంచాయితీ పెద్దలుగా, సాక్షులుగా కుటుంబ సభ్యులుగా నటించడానికి నటీనటులు కావాలె.. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించండి” అని ఉండటం విశేషం.
యారో సినిమాస్, డీఎస్ఎఫ్ తమ ప్రొడక్షన్ నంబర్ 2 కోసం 20 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య ఉన్న నటీనటుల కోసం చూస్తోంది. కనుక ఆసక్తి ఉన్నవాళ్లు ‘మీ ప్రొఫైల్స్ ను 9032765555కు వాట్సాప్ చేయండి. అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది” అనే క్యాప్షన్ తో మేకర్స్ షేర్ చేశారు.
ఇదొక రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ. మధ్యతరగతి వాళ్ల రోజువారీ జీవితాల్లో జరిగే మనస్సును కదిలించే బావోద్వేగ సన్నివేశాలతో వినోదాన్ని అందించే యూనిక్ కథాంశంతో సినిమా ఉండబోతుందట. ఈ మూవీలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడు.వంశీ రెడ్డి కథ అందించి దర్శకత్వం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యారో సినిమాస్, దొలముఖి సుభుల్ట్రన్ ఫిల్మ్స్ బ్యానర్లపై బూసం జగన్మోహన్ రెడ్డి, వేణు ఉడుగుల నిర్మిస్తున్నారు.