చిత్రం – చిట్టి పొట్టి
నటీనటులు – రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు

టెక్నికల్ టీమ్
బ్యానర్ – భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
ఎడిటర్ – బాలకృష్ణ బోయ
మ్యూజిక్ – శ్రీ వెంకట్
సినిమాటోగ్రఫీ – మల్హర్ భట్ జోషి
పీఆర్ఓ – లక్ష్మీ నివాస్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం – భాస్కర్ యాదవ్ దాసరి

అన్నాచెల్ల‌లు అనుబంధంలో మ‌రో సినిమా వ‌చ్చింది. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ “చిట్టి పొట్టి”. ఈ చిత్రాన్ని భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్ తో ..ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “చిట్టి పొట్టి” సినిమా అక్టోబర్ 3.న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది, సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
చెల్లెలు పవిత్ర పెళ్లి నిమిత్తం.. అన్నయ్య ఊర్లో ఉన్న వారిని అలాగే దూరం ఉన్న బంధువులను లేటెస్ట్ టెక్నాలజీని వాడి అందరిని కలుపుతాడు అన్నయ్య రామ్. పంతాలు, పట్టింపులు, బంధాలను అనుబంధాలు గుర్తు చేస్తూ చెల్లెలి వివాహం చాలా గ్రాండ్ గా చెయ్యాలని భావించిన అన్నయ్యకు అందరూ సహకారం అందిస్తారు. అన్ని కుటుంబాలు ఒకటిగా అయ్యి ఒక జంటను ఆశీర్వదిస్తారు. అమెరికాలో ఉన్న తస్వి రామ్ ను అమెరికా వచ్చేసేయ్ .. అని అంటూ ఉంటుంది, ఒక సందర్భంలో తస్వి ఇండియా వస్తుంది, రామ్ ను కలుస్తుంది, తరువాత ఏం జరిగింది అనేది కథ, అసలు పవిత్ర వివాహం ఎలా ఎవరితో జరిగింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

టెక్నిక‌ల్:
ఎడిటర్ బాలకృష్ణ బోయ బాగా కట్ చేశాడు, ఎక్కడా బోరింగ్ లేకుండా ఉంది. మ్యూజిక్ శ్రీ వెంకట్ ఇచ్చిన నేపధ్య సంగీతం బాగుంది, పాటలు బాగున్నాయి. ఎమోషన్ సన్నివేశాల్లో అద్భుతమైన ఆర్. ఆర్ ఇచ్చాడు, సినిమాటోగ్రఫీ అందించిన మల్హర్ భట్ జోషి కెమెరా వర్క్ బాగుంది.

విశ్లేషణ:
రామ్ మిట్టకంటి అద్భుతంగా నటించాడు, చెల్లెలి పాత్రలో పవిత్ర ఒదిగిపోయింది.. అన్న-చెల్లెలుగా జీవించారు. అమెరికాలో ఉంటున్న అమ్మాయి రోల్ లో కస్వి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు వారి పాత్రల పరిధి మేరకు బాగా.. నటించి మెప్పించారు.

కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం వహించిన భాస్కర్ యాదవ్ దాసరి చాలా మంచి కథతో ఎమోషన్ కథనంతో.. చిట్టి పొట్టి సినిమాను తీశారు. అన్న చెల్లెలి మధ్య ఉండే బాండింగ్ ను బాగా చూపించారు. ఫ్యామిలీ అందరూ కలిసుంటే ఎంత బాగుంటుంది. కుటుంబ విలువలు చక్కగా చూపించారు. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఇది.

రేటింగ్: 2.5 / 5

 

 

By admin