- ఎస్సీ 57 (MBSC) కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం విజ్ఞప్తి
ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టో – 2023లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎస్సి 57 (MBSC) ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని SC 57 MBSCఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అద్యక్షులు బైరి వెంకటేశం కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బైరి వెంకటేశం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల జనాభా కలిగిన 57 (MBSC) ఉపకులాలు 78 సంవత్సరాల నుండి దళితులకు దక్కాల్సిన విద్యా, ఉద్యోగ, ఉపాది, రాజకీయ అవకాశాలు పొందలేక తీవ్రంగా నష్టపోయారని ఇప్పటికైన ప్రత్యేక MBSC కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు AICC పెద్దలు మల్లికార్జున్ ఖర్గే , రాహుల్ గాంధి, K.C వేణుగోపాల్, AICC కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించినట్లు వారు తెలిపారు.
BREAKING NOW APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/