హైదరాబాద్: తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయనంలో భాగంగా బి సి కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ గౌరవనీయులు జి.నిరంజన్, సభ్యులు చేపట్టిన బహిరంగ విచారణలో మాంగ్ కులం తరపున మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ హాజరై కులం పత్రం పొందుటలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా మాంగ్ సమాజ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను, కులం అస్థిత్వం వంటి విషయాలను వివరంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
మాంగ్ సమాజ్ తెలంగాణ బ్రోచర్ ను కూడా వారికీ అందించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ మాంగ్ సమాజ్ ప్రజలు ఎదుర్కొంటున్న కులం పత్రం సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళి, పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చారు.