తమిళ‌నాడులోని సేలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పిల్ల‌ల‌ చదువు కోసం ఓ తల్లి త‌న ప్రాణాలనే త్యాగం చేసింది. పిల్ల‌ల‌ చదివించడానికి ఆర్థిక స్తోమత సరిపోక.. తాను చ‌నిపోతే ప్ర‌భుత్వం నుండి సాయం అందుతుంద‌ని భావించి బ‌స్సుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకుంది. సేలం ముల్లువాడికేట్‌కు చెందిన పాపతి(39) అనే మహిళకు పద్దెనిమిదిహేళ్ల క్రితం వివాహం కాగా, తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటోంది. కుమార్తె ఓ ప్రవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతుండగా.. కుమారుడు ఓ పాలిటెక్నిక్ కాలేజీలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరి ఆలనా పాలనా చూసుకుంటూ తల్లితో కలిసి జీవిస్తోంది. అయితే అమెకొచ్చే రూ.10,000 జీతం(నెలకు) ఇంటి అవసరాలకు, పిల్లల చదువులకు సరిపోయేది కాదు.

అందునా గత కొద్ది రోజులుగా కుమారుడి ట్యూషన్ ఫీజు(రూ.45వేలు) కట్టాలంటూ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేసింది. ఇప్పటికే పలుమార్లు సమయాన్ని పొడిగించగా.. వారిని మరోసారి సమయం అడగటానికి ఆమె మనసు అంగీకరించలేదు. ఈ క్రమంలో తెలిసిన వారి దగ్గర చేయి చాపగా.. వారు లేవని మొహం మీద చెప్పారు. పైగా నువ్వు చ‌నిపోతే నీ కుటుంబానికి ప్ర‌భుత్వం నుండి ఆర్థిక సాయం అందుతుందని ఉచిత స‌ల‌హా ఇచ్చారు.ఇది నిజమేనని నమ్మిన ఆ తల్లి బ‌స్సుకు ఎదురెళ్లి అత్మ‌హత్య చేసుకుంది.

కాకపోతే ఆ త‌ల్లి చేసిన ప్రాణత్యాగం ఫ‌లించ‌క‌పోవ‌డం బాధ‌కరం. పోలీసుల విచారణలో ప్ర‌మాద కేసు కాస్తా ఆత్మ‌హ‌త్య కేసుగా తెలియడంతో ప్ర‌భుత్వం నుండి ఎలాంటి ప‌రిహారం అందలేదు. ఈ విషాదకర ఘటనపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అభివృద్ధిలో ఎక్కడో ఉన్నామని చెప్పుకునే ప్రభుత్వ పెద్దలు.. ఇలాంటి వాటి గురుంచి కూడా అంతర్జాతీయ వేదికలపై మాట్లాడాలని సూచిస్తున్నారు.

***

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp

 

BREAKINGNEWS TV
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp
  • BREAKIN ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

    ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

    ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

     

    BREAKINGNEWS APP
    ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
    Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

    https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp

     

    BREAKINGNEWS TV
    https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnewsapp
    • BREAKINGNEWS TV

    https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

    BREAKINGNEWS TV & APP

    BREAKINGNEWS APP
    Breaking News APP

    https://shorturl.at/arOY7

By admin