దుబాయ్: విజిట్ వీసాలపై దేశానికి వచ్చి, వాటి గడువు ముగిసిన తర్వాత అక్కడే ఉండే పర్యాటకులకు తాజాగా యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలు, ఇమ్మిగ్రేషన్ అథారిటీలు వార్నింగ్ ఇచ్చాయి. ఇలా చేసే విజిటర్లపై పరారీ కేసులతో పాటు దేశ బహిష్కరణ ఉంటుందని హెచ్చరించాయి. విజిట్ వీసాల గడువు ముగిసిన తర్వాత ఐదు రోజుల కంటే ఎక్కువ కాలం దేశంలో ఉండే టూరిస్టు పేర్లను బ్లాక్‌లిస్ట్ చేసి, యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో కూడా ప్రవేశించకుండా నిషేధం విధించడం జరుగుతుందని ఈ సందర్భంగా ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఈ మేరకు గడిచిన కొన్ని రోజులుగా టూరిస్టులకు వార్నింగ్ అలెర్ట్ సందేశాలు పంపిస్తున్నాయి కూడా.

రూహ్ టూరిజయం ఆపరేషనల్ డైరెక్టర్ లిబిన్ వర్గీస్ మాట్లాడుతూ.. 30రోజులు లేదా 60రోజుల వ్యవధితో కూడిన విజిట్ వీసాపై యూఏఈకి వచ్చే పర్యాటకులు తమ స్పాన్సర్షిప్ కింద ఉంటారని తెలిపారు. ఒకవేళ తమ ద్వారా యూఏఈకి వచ్చిన విదేశీ టూరిస్టులు గడువు దాటి ఇక్కడే ఉండిపోతే తాము ఇబ్బందుల్లో పడి తీవ్రంగా నష్టపోతామని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ భద్రత కోసం వీసా కాలపరిమితి దాటి దేశంలో ఉండే విజిటర్లపై పరారీలో ఉన్నట్లు ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఒక పర్యాటకుడు వీసా గడువు దాటి దేశంలో ఉన్నట్లయితే తమపై కూడా జరిమానా పడుతుందని చెప్పారు. చివరకు ఇలా కాలపరిమితి ముగిసిన వ్యక్తి ఎక్కువ కాలం దేశంలో ఉన్నందుకు ఫైన్ కట్టడడంతో పాటు కంట్రీ నుంచి నిష్క్రమించేందుకు ఔట్‌పాస్ కూడా పొందాలి. ఇలాంటి సందర్భాల్లో అది ట్రావెల్ ఏజెన్సీలకు తలకుమించిన భారంగా పరిణమిస్తుందని చెప్పారు. ట్రావెల్ ఏజెంట్లు తాము స్పాన్సర్ చేసిన సందర్శకులు యూఏఈలో ఎక్కువ కాలం గడిపినట్లయితే కొత్త వీసాల కోసం దరఖాస్తులను తమ పోర్టల్ అంగీకరించదని తెలిపారు.

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin