హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
ఎస్సీల్లో ఉప కులమైన మాంగ్ సామాజికవర్గానికి ప్రభుత్వ పథకాల్లో అన్యాయం జరుగకుండా చూడాలని మాంగ్ రాష్ట్ర సంక్షేమ సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావును మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు.
షెడ్యూల్డ్ కులాల వారి సంక్షేమం కోసం ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో మాంగ్ కులం వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో ఆధిక సంఖ్యలో దళిత బంధు యూనిట్లు మాంగ్ కులం వారికీ అందించి మాంగ్ కులం అభ్యున్నతికి సహకారం అందించవలసిందిగా, మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షులు తులసీదాస్ గాయక్వాడ్ ఎమ్మెల్యేని ప్రత్యేకంగా కోరారు. అందుకు బాపురావు సానుకులంగా స్పందించి లబ్ధిదారుల ఎంపికలో మాంగ్ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేని కలిసినవారిలో సమాజ్ ప్రధాన కార్యదర్శి కే. శంకర్, సంయుక్త కార్యదర్శి జి. చంద్ర శేఖర్, ఏ. ప్రకాష్ తదితరులు ఉన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews