◉ బడ్జెట్‌లో జీరో కేటాయింపులపై మండిపడుతున్న గల్ఫ్ కార్మికులు

◉ నువ్వు కుండ కాడ చూస్తే… మేము బండ కాడ చూస్తాం అంటున్న గల్ఫ్ వలస జీవులు
◉ పసుపు బోర్డు లాగా… గల్ఫ్ బోర్డు సాధన ఉద్యమం రాజకీయ మార్పులు తెస్తుంది
◉ 13 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ చేసిన గల్ఫ్ వర్కర్స్ పొలిటికల్ ఫోరం

తెలంగాణ బ‌డ్జెట్‌లో గ‌ల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అన్యాయం చేశారంటూ గ‌ల్ఫ్ సంఘాలు మండిప‌డుతున్నాయి. బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదని, దీనిపై ప్రతిపక్షాలు కూడా మాట్లాడటం లేదని గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ అన్ని రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాశారు. బడ్జెట్ లో జీరో కేటాయింపులు చేశారు కాబట్టి మేము కూడా… జీరో అనే పదంపై దృష్టి పెట్టాము. జీరో పవర్ తో ఖర్చు లేని రాజకీయం, అదే… జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని అనుకుంటున్నామని ఆయన అన్నారు.

ఉద్యమానికి, రాజకీయానికి భిన్నత్వంలో ఏకత్వం లాంటి పోలిక ఉంటుంది. నాన్ పొలిటికల్ ఉద్యమం, పొలిటికల్ ఫైట్ రెండూ ఏక కాలంలో జరుగుతాయి. ఉద్యమాన్ని చిన్న చూపు చూసిన ఫలితంగా… గల్ఫ్ కార్మికుల రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గల్ఫ్ వలసలు ఉన్న ఈ క్రింద 13 అసెంబ్లీ నియోజకవర్గాలను మొదటి బ్యాచ్ లో ఎంపిక చేయాలని సూచనలు వచ్చాయి. ఒక మోస్తరు గల్ఫ్ వలసలు ఉన్న మరిన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను రెండవ బ్యాచ్ లో ఎంపిక చేస్తామని రవిగౌడ్ తెలిపారు.

1. నిర్మల్, 2. ముధోల్, 3. ఖానాపూర్ (ఎస్టీ), 4. వేములవాడ, 5. సిరిసిల్ల, 6. చొప్పదండి (ఎస్సీ), 7. బాల్కొండ, 8. ఆర్మూర్, 9. కోరుట్ల, 10. జగిత్యాల, 11. ధర్మపురి (ఎస్సీ), 12. ఎల్లారెడ్డి, 13. కామారెడ్డి

కార్పోరేట్ పాలిటిక్స్‌కు బుద్ది చెబుతాం

మీ జీవితంలో ప్రతిదీ రాజకీయమే నిర్ణయిస్తున్నప్పుడు, మీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి.. అనే సూక్తి ప్రకారం గల్ఫ్ కార్మికుల సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాము. ఖరీదయిన కార్పొరేట్ రాజకీయ శక్తులను అడ్డుకొని సామాన్య గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ రిటనీలు, వారి కుటుంబ సభ్యులు ఒక రాజకీయ పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాం. ‘జీరో బడ్జెట్ పాలిటిక్స్’ నినాదం స్పూర్తితో… క్షేత్ర స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గం యూనిట్ గా మా కార్యకలాపాలు ప్రారంభిస్తాం.

గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్ కార్మిక నాయకుడు

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

By admin