‘ఆది’పర్వం
పోయినోళ్లంతా మంచోళ్లు
ఉన్నోళ్ల తీపిగురుతులు అంటారు..
అలాంటి పోయినోళ్లను కూడా
చెడ్డోళ్లనీ.. వారి వారి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాం
కరెక్టేనా?
వాళ్ల లోటు పాట్లను చూడాల్నా?
లేక వారు చేసి పోయిన మంచి పనులు చూడాల్నా?
ప్రముఖులు
వారి వ్యక్తిగత బలహీనతలు
ఇదో పెద్దసబ్జెక్ట్
ఇందులో కులమతాలకు తావు లేదు
వారు వారు ఆపగానే ఇక్కడెవ్వరూ ఆగిపోరు
అరిచేతిని అడ్డు పెట్టగానే
ఆగిపోయే సూర్యోదయాలు
ఈ జగతి మీద లేనే లేవు
సచిన్- వినోద్ కాంబ్లీ నుంచి మొదలు పెడితే
అందులో వారి వారి వ్యక్తిగత లోటు పాట్లుంటాయి
కానీ వారి కులమతాల ప్రాధాన్యతే ఎక్కువగా
ప్రభావితం చేస్తుందంటే చేస్తుంది..
కాదనడం లేదు…. కానీ
దాంతోనే మొత్తం అయిపోదు….
ఇదే క్రికెట్ లో ఎందరో ముస్లిమ్ క్రీడాకారులున్నారు
అజరుద్దీన్, జహీర్ ఖాన్ ల నుంచి
నేటి షమి, సిరాజుద్దీన్, ఉమ్రాన్ మాలిక్ వరకూ
చాలా మంది టాలెంటెడ్స్ తెర మీదకొచ్చి
గొప్పగా రాణిస్తున్నారు
ముంబై వాళ్లే క్రికెట్ లో రాణిస్తారంటే
మరి ఢిల్లీ బాద్షా కింగ్ కోహ్లీ ఎలా పొడుచుకొచ్చాడు?
ముంబైయన్ రోహిత్ శర్మ
కెప్టెన్సీ ఎందుకలా భారీ ఐసీసీ కప్పుల్లో చతికిల పడుతోంది?
ఇక సినిమాల్లోనంటారా?
బాలసుబ్రహ్మణ్యం తొక్కేస్తాడనే పేరున్న మాట నిజమే
ఒక వేళ నేను తొక్కేస్తే..
మరి నా చెల్లెలు శైలజ మాటేమిటి?
ఆమె ఎందుకు అంతగా ఎదగలేక పోయింది?
అన్నది ఆయన తరఫు ప్రశ్న…
ఇక్కడ చూడండీ..
బాలు పాడాల్సిన పాటలకు చాలానే పాడేవాడు మనో
కొన్ని సార్లు బాలు ఆ పాటలు విని..
బాగుంది కదా అలాగే ఉంచేయండని పాడకుండానే వెళ్లిపోయేవాడు
మరి మనో ఎవరు?
ఏ కమ్యూనిటీకి చెందిన వాడు?
ఇప్పుడతని పరిస్థితేంటి?
సౌతిండియాలో రజనీ స్థాయిలో డబ్బింగ్ చెబుతున్న
గొప్ప కళాకారుడిగా ఎదిగాడు
ఇక విశ్వనాథ్ జంధ్యపు పోసల వ్యవహారం
ఇది నిజంగానే తప్పే…
అది ఆయన వ్యక్తిగత వ్యవహారం
నేను చాలా మంది కమ్యూనిస్టులను చూశా
దళిత బహుజన కళాకారులను చూశా…
వారికుండాల్సిన వ్యక్తిగత సమస్యలు వారికుంటాయి
ఒక ప్రజా వాగ్గేయ కళాకారుడు
దగ్గరకు ఇంటర్వ్యూకని వెళ్తే…
అతడి హడావిడి అతడు ఇతరులను చేసే
అవమానాలకు ఒక అంతంటూ
ఉండదు…
అలాగని అతడి కళను కాదనగలమా?
ఒక కమ్యూనిస్టును ఇటీవల కలిశాన్నేను
ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి చూసి
అతడు పాటించే గోప్యతను చూసి
అతడి చాటు మాటు ధోరణి చూసి
ఇతడేం కమ్యూనిస్టూ?
అన్న డౌటొచ్చింది….
ఆయనపై నేను ఇవ్వాల్సిన స్టేట్ మెంట్
క్వయిట్ పాజిటివ్ గా ఇచ్చా
ఇక్కడ నేను ఆయన లో చూసింది..
ఆయన ప్రతిభను తప్ప.. ఆయన లోటు పాట్లను కాదు…
నేనైతే…
సినిమా పరంగా చాలా సార్లు భంగ పడ్డా
నన్ను దగా చేసిన వారిలో నా కులపోళ్లు కూడా ఉన్నారు..
నేను ఒకానొక గీత రచయిత దగ్గర పనికి చేరా
కంటి.. ఆయన ఇంటిపేరు చివరన వస్తుంది
ఆయన తన జట్టులోకి తీసుకోవడానికి
చాలానే వెనకడుగు వేశారు..
తర్వాత ఆయన ద్వారా నేనొక
దళిత బహుజన కథాంశాలే ప్రధానంగా
సినిమాలు, నాటకాలు రాసే
రచయిత….. దగ్గర చేరా..
ఆయన ద్వారా నాకు లభించిన లబ్ధి ఇదేనని సర్దుకున్నా
ఇటీవల నాకు ప్రముఖ దర్శకుడి ద్వారా
దారుణమైన నష్టం జరిగింది…
నేను ఆయన్ను కలిసింది ఒక్కసారే
కానీ నానుంచి ఆయన రెండు సబ్జెక్టులు దొబ్బేశాడు
ఆ సబ్జెక్టుల విలువ అక్షరాలా
500 కోట్ల రూపాయలకు పైగా..
ఇలాంటి దగాకోరు పుష్పరాజ్ లు చాలా మందే ఉన్నారు..
అలాగని ఆయన దర్శకత్వ ప్రతిభ గురించి
నేను రాయాల్సి వచ్చినా గుడ్ మార్క్స్ వేస్తా…
తొక్కేయడాలు, కులాభిమానాలు ఈనాటివి కావు….
ఇవి భూమి పుట్టిన తొలి నాళ్ల నుంచీ ఉన్నాయి…
ఫలానా వాళ్లే మంచి వాళ్లనీ చెడ్డవాళ్లనీ లేదు
అవి పూర్తిగా కులమతాలకు అతీతం
ఇవాళ సినిమా రంగంలో
తొక్కేయడం ఎవరినీ ఆపలేదు
ఎవరినీ ముందుకు తీసుకెళ్లలేవు
జూనియర్ ఎన్టీఆర్ ని ఎంత తొక్కేయాలని చూసినా
అతడు పైపైకి ఎదుగుతూనే వచ్చి
ఇవాళ ఇంటర్నేషనల్ యాక్టింగ్ ఐకాన్ గా మార లేదా?
ఇదే తారకరత్న
ఒకే రోజు తొమ్మిది సినిమాలు మొదలై
అతి పెద్దస్టార్ హీరోగా ఎదుగుతాడనుకుంటే
మిగిలింది గుండు సున్నా
ఇవాళ ఆస్పత్రి ఖర్చులకు కూడా డబ్బుల్లేవు
ఎన్టీఆర్ కి అంత మంది పిల్లలుంటే
వాళ్లలో ఒక్క బాలకృష్ణ తప్ప
మరెవరూ ఎదగలేక పోయారు
ఇక మంచు కుటుంబం
ఆయన తన ఇద్దరు కొడుకులను
అతి పెద్ద స్టార్ హీరోలుగా చేయాలనుకున్నాడు
కానీ చేయలేక పోయాడు
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే….
చేతిలో కులంకార్డు ఉంది కదాని
క్యాష్ కెపాసిటీ ఉంది కదాని
స్టార్ డమ్ రావాలని లేదు
ఎదిగి తీరాలనీ లేదు
ఇదే విజయ్ దేవరకొండను ఎవరైనా ఆపగలరా?
ఇదే సందీప్ రెడ్డి వంగాను
అర్జున్ రెడ్డి సినిమా తీయకుండా ఎవరైనా అడ్డుకున్నారా?
ఇదే దిల్ రాజును
ఇంత పెద్ద నిర్మాతగా ఆపడానికి ఏ ఆంధ్రోడైనా
ప్రయత్నించి విజయవంతం కాగలిగారా?
తెలంగాణ వచ్చాక
వెంటనే ఇక్కడి సినిమా ఎదిగిపోద్దన్నారు
ఆంధ్రోళ్ల చేతుల్లోంచి తెలుగు సినిమాను
విడగొట్టి తెలంగాణ సినిమాను
సిద్ధం చేస్తామన్నారు…
ప్రతి పెద్ద పండక్కీ
విడుదలవుతోంది ఆంధ్రోళ్ల సినిమాలే…
ఏవీ లక్ష నాగళ్లు
ఎక్కడికెళ్లాయి ఆనాటి సింహా అవార్డును
తెస్తామన్న హామీలు???
మిలియన్ డాలర్ క్వశ్చిన్ మార్క్
అలాగని ఆంధ్రతెలంగాణ బేధం చూస్తున్నారా?
అంటే మరి ‘విరాట పర్వం’ తీసిన వేణు ఎవరు?
అందులో నటించిన వారెవరు?
దాన్ని నిర్మించిన వారెవరు?
ఈ సినిమా ద్వారావేణు దర్శకత్వ ప్రతిభను ఎవరైనా చాటు చేయగలిగారా?
ఈరోజు పాటల రచయిత బోస్
RRR నాటు పాట ద్వారా
గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకునే వరకూ వెళ్లడంలో
ప్రాంతీయాభిమానం ఎక్కడైనా అడ్డుకట్ట వేయగలిగిందా?
ఇలా చెప్పుకుంటూ పోతే
ఒక హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, శేఖర్ కమ్ముల, సురేందర్ రెడ్డి, శ్రీరామ్ వేణు, హను రాఘవపూడి
వీరంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకులు
వీరి అవకాశాలను ఆపి…
వాటిని తమ కులపోడికి కట్టబెట్టాలనుకున్న వారెవ్వరూ లేరిక్కడ
ఒక వేళ అలా చేయగలిగినా..
వారికంటూ మిగిలిందేంటో అందరికీ తెలుసు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
కొడుకు తిరిగి దర్శకుడిగా ఎదగలేక పోయాడు
ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు…
ఏఆర్ రెహమాన్ అనే వాడు
బ్రాహ్మణుడై ఉండి… ముసలమాన్ గా మతం మార్చుకున్నా
అతడి కళా ప్రతిభను ఆపిన వాడు లేడు
ఇపుడతడి ఆఫీసు లండన్ లో ఉంది..
అంతటి ఇంటర్నేషనల్ మ్యూజికల్ ల్యాండ్ మార్క్అయ్యి కూర్చున్నాడతడు
నిజానికి తెలుగు సినిమా రంగంలో
కులాభిమానానికి చాలా పెద్ద చరిత్రే ఉంది…
కాదనడం లేదు..
ఈ కుల నిచ్చెనల కారణంగా
ఎందరో ఎదగలేక పోయారు
అలాగని ఎదగకుండా ఆగిన వారు కూడా లేరు..
ఇప్పటికీ బ్రాహ్మణ దర్శకుడు ఆకెళ్ల శ్రీనివాస్ అలియాస్
త్రివిక్రం లాంటి వారి దర్శకత్వంలో పని చేయాలని
ఉవ్విళ్లూరే… కాపు, కమ్మ కథానాయకులెందరో
ఇదో క్లమ్జీ వ్యవహారం..
వారి వారి పర్సనల్ స్కిల్స్ కి సంబంధించిన ఇష్యూ
సుకుమార్ ఒక మాట అంటాడు
నీ టాలెంట్ నెక్స్ట్ థింగ్
నీ మేనేజ్మెంటే కెరీర్ లో అత్యంత కీలకం
తన సాటి కులపు హీరో దగ్గరకు వెళ్లి కథ చెబితే
చేయాలా వద్దా అని మరో దర్శకుడ్ని అడిగాడా కులపు హీరో
నువ్ చెయ్ నేను చూసుకుంటా అని ఆ దర్శకుడు అనడంతో
ఇప్పుడా కులపు హీరోతో సీక్వెల్స్ తీసే స్థాయికి చేరాడు
సుకుమార్……….
ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో చాట భారతం
అంతులేని రామాయణం
వ్యక్తిగత లోటు పాట్లు.. కులమతాలతకు అతీతం
ఫలానా బాలు, సిరివెన్నెల, కేవిశ్వనాథ్ ల
వ్యక్తిగత లోటు పాట్లను సోషల్ మీడియా
గోడల మీద పిడకలద్దుతున్నవారికి
నాదో ఛాలెంజ్………..
నేను ఇలాంటి వారితో కలసి ఒక రోజంతా ఉంటా
వారిలో ఇలాంటి ఎన్నో లోటు పాట్లను
వేళ్ల మీద లెక్కబెట్టి మరీ చెబుతా
అంతా ట్రాష్
వారి లిటరల్ కంట్రిబ్యూషన్ ఎంత?
వారీ సమజాన్ని ఎంత మేర
ప్రభావితం చేయగలిగారు?
అన్నదింపార్టెంట్………………..
దానికి తోడు
క్రియేటివ్ బీయింగ్ అనేవాడిలో
తెలిసో తెలీక కొంత శాడిజం తప్పక ఉంటుంది
దాన్ని దాటి మరీ వారి వారి
క్రియేటివ్ వర్క్స్ అంచనా వేయాల్సి ఉంటుంది
ఏమంటారు????????????
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews