కామెడీ, హ‌ర‌ర్ క‌ల‌గలిపి సినిమా తీస్తే హిట్టు గ్యారంటీ అని గ‌త సినిమాలు రుజువు చేశాయి. అలాంటి కోవాలో వ‌చ్చిన తాజా సినిమా ‘అదో దెయ్యం క‌థ‌స‌. డైరెక్ట‌ర్ నాగమణి యేడిది నిర్మించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఆగస్ట్ 18న విడుద‌ల అయింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్ట్‌లో తెలుసుకుందాం.

క‌థః
హీరో అత‌ని ఫామ్‌హౌస్‌కి తాగ‌డానికి త‌న‌ ఫ్రెండ్‌తో నిత్యం రాత్రి వెళ్తుంటారు. ఒక రోజు హీరో ఒక ఆత్మ‌ను చూస్తాడు. అది అస‌లు ఆత్మా? అమ్మాయా? అనే అనుమానం వ‌స్తుంది. నిజం తెలుసుకుందామ‌ని ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతాడు. అది ఆత్మ అని తెలుసుకుని బాధ‌ప‌డుతాడు. ఆత్మ‌కు త‌న స్టోరీ చెప్ప‌మ‌ని అడుగుతాడు. ముందుగా చెప్ప‌దు, హీరో మీద న‌మ్మ‌కం కుదిరాక ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ చెబుతుంది. ఆ ఆత్మ‌కు ప‌గ తీర్చుకోవ‌డానికి సాయం చేస్తాన‌ని హీరో చెబుతాడు. అస‌లు ఆమెను ఎవ‌రు చంపారు? ఎందుకు ఆత్మ‌గా మారింది? ఎందుకు ఆ ఫామ్‌హౌస్ చుట్టే ఎందుకు తిరుగుతుంది? ఎందుకు హీరోకు ఆ క‌థ చెబుతుంది?

న‌టీన‌టుల ప్ర‌తిభః
దామిని(ఆత్మ) పాత్ర‌లో న‌టించిన‌ హిమ మోహ‌న్ యాక్టింగ్ సూప‌ర్ అనే చెప్పాలి. ఎమోష‌న్స్ పండించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఆమె యాక్టింగ్ సూప‌ర్. ఇక‌ హీరో, అత‌ని ఫ్రెండ్ కూడా త‌మ త‌మ‌ పాత్ర‌ల్లో చ‌క్క‌గా కుదిరారు.

టెక్నిక‌ల్ టీమ్ః
మ్యూజిక్ డైరెక్ట‌ర్ హ‌ర్ష ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మెయిన్ హైలైట్. ప్ర‌తి సీన్‌కు ఆర్ఆర్ చాలా చ‌క్క‌గా కుదిరింది. ఉత్కంఠభరితమైన స‌న్నివేశాల‌ను చూపించ‌డంలో DOP ప‌నితీరు చాలా బాగుంది.
సినిమా క్వాలిటీ ప‌రంగానూ బాగుంది. బ‌డ్జెట్‌కు ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత‌లు నాగమణి యేడిది, కేవీ రామ‌చంద్ర నిర్మించిన విధానం బాగుంది. చిన్న సినిమా అయినా భారీ బ‌డ్జెట్ రేంజ్‌లో తెర‌కెక్కించిన‌ట్టు కనిపిస్తుంది.

విశ్లేష‌ణః
త‌క్కువ పాత్ర‌ల‌తో తెర‌కెక్కించిన ఈ సినిమాలో అన్ని ర‌కాల ఎలిమెంట్స్ ఉన్నాయ‌ని చెప్పొచ్చు. ఎమోష‌న్స్, డ్రామా, ట్విస్టులు, థ్రిల్లింగ్.. ఇలా అన్ని ఉన్నాయి. నాగమణి యేడిది డైరెక్ష‌న్ చాలా బాగుంది. క‌థ‌లో ఉన్న ట్విస్టుల‌ను ఊహ‌కంద‌ని రీతిలో ఆమె తెర‌కెక్కించారు. త‌ను రాసుకున్న క‌థ‌ను అంతే స్ప‌ష్టంగా తెర మీద చూపించారు. స్క్రీన్‌ప్లే చ‌క్క‌గా కుదిరింది.

కామెడీ, హ‌ర‌ర్ క‌ల‌గలిసిన ఈ చిత్రం ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంద‌ని చెప్పొచ్చు. ఇది మిమ్మల్ని మీ సీటు అంచున ఉంచుతుంది.

రేటింగ్ 3.75 / 5

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin