హైదరాబాద్:
అమెరికాలో తెలుగు ఎన్నారైలు చిత్రీకరించిన ‘అమెరికాలో మనం’ సినిమా నుంచి ఓ పాట హైదరాబాద్ రవీంద్రభారతీలో ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఈ సినిమా నుంచి ”అలుపెరగని పరుగుల్లోన..” అనే పాటను ఆవిష్కరించారు. చిత్రయూనిట్‌ను, మూవీ మేకర్ వేణు నక్షత్రంను అభినందించి, ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అవంతిక నక్షత్రం, డైరెక్టర్ సాయిరాం పల్లె పాల్గొన్నారు.