స‌హాన ఆర్ట్స్ ప‌తాకంపై శ్రీమ‌తి క‌మ‌ల‌మ్మ మ‌రియు వెంకటేశ‌ప్ప స‌మ‌ర్ప‌ణ‌లో రాజు, సహాన జంట‌గా సురేష్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో మునికృష్ణ సీవీ, గీతాకృష్ణ నిర్మించిన చిత్రం `బ‌రి`. తాజాగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇంత‌కీ ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

క‌థ‌:
గ్రామీణ క‌థ ఇది. కోడి పందెల చుట్టు కీల‌క ప‌రిణామాల నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. ఆ గ్రామంలో ఉండే ఓ యువ‌కునికి కోడిపందేల పిచ్చి. ఆ విష‌యంలో ఇంట్లో వాళ్లు అత‌డ్ని తిడుతుంటారు. ఒక రోజు అనుకోకుండా అత‌ని ద‌గ్గ‌రికి ఒక పుంజు వ‌స్తుంది. దాని విలువ ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు. అదృష్టం వ‌చ్చింద‌ని అనుకుంటుండ‌గానే, హ‌ఠ‌త్తుగా ఆ పుంజు మిస్ అవుతుంది. ఇక అత‌ని ఫ్యామిలీకి స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. అత‌ని చెల్లి మ్యారేజ్ రిస్క్‌లో ప‌డుతుంది. మ‌రి ఆ పుంజు దొరుకుతుందా? అత‌ని ఫ్యామిలీ స‌మ‌స్య‌లు తీరుతాయా? అనేదే మిగ‌తా క‌థాంశం.

న‌టీన‌టులు ఫ‌ర్మార్మెన్స్:
ఈ సినిమాతో హీరోహీరోయిన్ వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఈ జంట‌ ఎంతో అనుభ‌వం ఉన్న‌వారిలా న‌టించారు. హీరో రాజు ఫ‌స్ట్ మూవీ అనే ఫీలింగ్ ఎక్క‌డా రాకుండా చాలా బాగా ప‌ర్మార్మెన్స్ ఇచ్చాడు. ఇక హీరోయిన్ సహాన తుల‌సి అనే పాత్ర‌లో న‌టించి మెప్పించింది. న‌టుడు నాగ‌మ‌హేష్ కోడిక‌త్తి శీను పాత్ర‌లో న‌టించాడు. నెగిటివ్ రోల్‌లో క‌నిపిస్తాడు.

టెక్నిక‌ల్:
ఈ సినిమా కోసం టెక్నిక‌ల్‌గా హైస్టాండెడ్‌లో ఉంది. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా నిర్మించార‌ని అర్థ‌మ‌వుతుంది. ఇందులో 4 పాట‌లున్నాయి. మ‌హ‌వీర్ అందించిన సంగీతం సినిమాకు ప్ల‌స్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక‌ అనిల్ కుమార్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీకి ఫుల్ మార్కులు వేయ‌వ‌చ్చు. శ్రీకృష్ణ అత్త‌లూరి చేసిన ఎడిటింగ్ ప‌ర్వాలేదు. బాల న‌ర‌సింహా కొరియోగ్ర‌ఫీ బాగుంది.

విశ్లేష‌ణ‌:
బ‌రి అనే టైటిల్‌తోనే సినిమా ఎంత‌ ఫ‌వ‌ర్ఫుల్‌గా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. టైటిల్‌కు త‌గ్గ‌ట్టే సినిమా క‌థ‌నం ఆద్యాంతం ఆక‌ట్టుకుంటుంది. సినిమాలో ప‌లు సీన్‌లు భావోద్వేగానికి గురి చేస్తాయి. గ్రామీణ నేప‌థ్యంలో కోడి పుంజులు, కోడి పందేలు ప్ర‌ధానాశంగా ఇంత‌కు ముందెప్పుడూ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఇలాంటి క‌థాంశంతో సినిమా రాలేదు. మొట్ట‌మొద‌టి సారిగా అచ్చ‌తెలుగు ప‌ల్లెటూరి లోకెష‌న్ల‌లో డైరెక్ట‌ర్ సురేష్ రెడ్డి తెర‌కెక్కించిన విధానం సూప‌ర్ అనే చెప్పాలి. షూటింగ్ జ‌రిపిన‌ రేప‌ల్లె, బాప‌ట్ల‌, తెనాలి ప్రాంతాలు ఎంతో అందంగా క‌నిపిస్తాయి. ఇక ఈ సినిమాలో ప్ర‌తి పాత్రను ఎంతో స‌హ‌జంగా చిత్రీక‌రించారు. ప్ర‌తి ప్రేమ్‌లో ద‌ర్శ‌కుడి హార్డ్ వ‌ర్క్ క‌నిపిస్తుంది. దీంతో ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రిని అల‌రిస్తుంద‌ని చెప్పొచ్చు.

రేటింగ్: 3 / 5

HyStar APPలో మీరూ మీ Profile క్రియేట్ చేసుకొండి సినిమా ఛాన్స్ – మీడియా అవ‌కాశాలు అందుకొండి.. HyStar APP Google play store link: https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar website link: www.hystar.in

By admin