అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా, వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ డైరెక్ట‌ర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వ‌హించ‌గా, ప్ర‌ముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీ‌లేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

 

ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ.. ”సినిమా ప్రారంభోత్స‌వం ఒక పండ‌గ‌గా జ‌రగ‌డం సంతోషంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం. స‌బ్జెక్టు బాగా వ‌చ్చింది. అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంట‌గా చేస్తున్న‌ ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌రికి న‌చ్చుతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం..” అని తెలిపారు.

 

అప్సరరాణి మాట్లాడుతూ… ”మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుంద‌న్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్ట‌ర్‌కు ధ‌న్య‌వాదాలు..” అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ యం యం శ్రీలేఖ మాట్లాడుతూ.. తొలిషాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పాటలు చాలా బాగా వ‌చ్చాయి. అంద‌రిని ఆక‌ట్టుకుంటాయి, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. అంద‌రికి న‌చ్చుతుంది..” అని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ మాట్లాడుతూ… ఒక అద్భుతం జరుగుతుందంటే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని ఈ సందర్బం రుజువు చేసింది. ఒక టాలెంట్ ఉన్న డైరెక్ట‌ర్ ఈ సినిమాను ఒక తపస్సులా చేస్తున్నాడు. కృష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారు. ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా, పర్ఫెక్ట్ సిద్ధం చేశారు. హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం, హీరోయిన్ అప్సర రాణి కూడా నిబ‌ద్ద‌త‌తో, అంకిత‌భావంతో ప‌ని చేసే వ్య‌క్తి. ఆమె డెడికేష‌న్ ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది..” అని తెలిపారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీఎన్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ… చిత్ర‌యూనిట్‌కు బెస్టాఫ్ ల‌క్ చెప్పారు. ఎంతో ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్న చిత్ర‌యూనిట్ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

 

బ్యానర్‌ :వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.

హీరోహీరోయిన్స్ :అరుణ్ ఆదిత్య , అప్సర రాణి.

నటీనటులు : సీనియర్ నటి లక్ష్మీ , బేబీ వినూత , ఉదయ్ భాను

స్క్రీన్ ప్లే – దర్శకత్వం :కృష్ణ బాబు

నిర్మాత : నల్లా శ్రీదేవి

సహా నిర్మాత : చైతన్య కిరణ్

ఎగ్జిక్యూటివ్స్ : వెంకటేష్ , ఖుషి

ఆర్ట్ : కోటి

సమర్పణ : జస్ట్ ఎంటర్టైన్మెంట్స్

సంగీతం : యం. యం శ్రీలేఖ

డి. ఓ.పి : ఆర్ భాస్కర్

పి.ఆర్.ఓ : దయ్యాల అశోక్

 

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin